కంటెంట్ ఉన్న కథలతో అలరిస్తూ ఉంటారు తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్. తాజాగా ఈయన చేసిన ఓ పనితో ఫిల్మ్ లవర్స్ కంగుతిన్నారు. పోయిన సంవత్సరం.. తన వైఫ్ నయన్, త్రిష, విజయ్ సేతుపతి కాంబోలో ‘కాతువాకుల రెండు కాదల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు విఘ్నేశ్. ఈ సినిమా ఓ మోస్తారుగా ఆడింది. దీంతో ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాను అజిత్‌తో సినిమా చేయబోతున్నట్లు తెలిపి.. ఆ హైప్ మరింత పెంచేశారు విఘ్నేశ్. అజిత్ 62వ సినిమాగా వస్తున్న ఈ మూవీ లైక్ ప్రొడక్షన్ బ్యానర్‌లో రాబోతున్నట్లు గతంలో అనౌన్సిమెంట్ కూడా వచ్చింది. దీంతో మూవీ ఎప్పుడు స్టార్టవుతుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే విఘ్నేశ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే విఘ్నశ్ కూడా తన ట్విట్టర్ బయో నుంచి AK 62 అనే పేరును రిమూవ్ చేశారు. దీంతో ఈ సినిమా గురించి వచ్చిన వార్తలు నిజమేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ కాంబో ఇప్పట్లో ఉండదని ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. టెంపరరీగానే క్లోజ్ అయ్యిందా… లేదా పర్మనెంట్‌గా ఆగిపోయిందా అనే విషయంపై నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.