ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలైన తునీవు సినిమాతో మరో హిట్ అందుకున్నారు తమిళ్ స్టార్ హీరో అజిత్. ఈ మూవీ తర్వాత ఆయన చేయబోయే సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అజిత్ నెక్ట్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో ఉండబోతున్నట్లుగా అఫీషియల్ అనౌన్స్ వచ్చింది. అయితే కొన్నాళ్లకు ఈ సినిమా నుంచి డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ను తొలగించి.. అతని స్థఆనంలో మగిజ్ తిరుమేనిని ఎంపికచేశారు నిర్మాతలు. ఇక మరోవైపు విఘ్నేష్ సైతం తన ట్విట్టర్ ఖాతా నుంచి ఈ సినిమాకు సంబంధించిన ట్వీట్ తొలగించడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే అజిత్ సినిమా నుంచి విఘ్నేష్ ను తొలగించడం అటు కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ సినిమా కారణంగా నయనతారకు.. అజిత్ కు మధ్య విభేదాలు కూడా వచ్చినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. తాజాగా ఈ సినిమా క్యాన్సిల్ కావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డైరెక్టర్ విఘ్నేష్ శివన్.
ఇటీవల ఆయన పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను రాసిన స్టోరీలో సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ నిర్మాతలకు నచ్చలేదు. ఇందులో అజిత్ తప్పులేదు. ఆయనకు నా సినిమా చాలా నచ్చింది. కానీ నిర్మాతలు మాత్రం అంతగా బాలేదు అన్నాు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది ” అంటూ చెప్పినట్లు తెలుస్తోంది. అజిత్ సినిమాకు మగిజ్ తిరుమేనికి అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు విఘ్నేష్.
ప్రస్తుతం AK 62 వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా టైటిల్.. మిగతా విషయాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.