Allu Arjun: తమిళంలోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్న అల్లు అర్జున్.. కానీ ఆ సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్నారట..

|

Apr 12, 2023 | 7:58 AM

అయితే ఇప్పటివరకు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించిన బన్నీ.. కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నారట. డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో అర్జున్ ఓ సినిమా చేయాలనుకున్నారట. కానీ అనుకోని కారణాలతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందట. ఈ విషయాలను ఇటీవలే డైరెక్టర్ వెట్రిమారన్ బయటపెట్టారు.

Allu Arjun: తమిళంలోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్న అల్లు అర్జున్.. కానీ ఆ సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్నారట..
Allu Arjun, Director Vetrim
Follow us on

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‏కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా మారిన బన్నీ.. ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్‏కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు వై.రవిశంకర్, నవీన్ యెర్నేని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బన్నీ.. డైరెక్టర్ సందీప్ వంగతో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. అయితే ఇప్పటివరకు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించిన బన్నీ.. కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నారట. డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో అర్జున్ ఓ సినిమా చేయాలనుకున్నారట. కానీ అనుకోని కారణాలతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందట. ఈ విషయాలను ఇటీవలే డైరెక్టర్ వెట్రిమారన్ బయటపెట్టారు.

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. కమెడియన్ సూరి ప్రధాన పాత్రలో డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కించిన చిత్రం విడుదలై పార్ట్ 1. మార్చి 31న తమిళంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 15న ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో డైరెక్టర్ వెట్రిమారన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తారక్, బన్నీ సినిమాల గురించి స్పందించారు.

తెలుగులో తాను ఎన్టీఆర్ కంటే ముందే అల్లు అర్జున్, మహేష్ బాబును కూడా కలిశానని తెలిపారు. “ఆడు కాలం సినిమా తర్వాత బన్నీని కలిశాను. తాను తమిళంలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నానని.. ఆసక్తి ఉంటే ఓ కథ చెప్పమని అడిగారు. అప్పుడు నేను రాసుకున్న వడ చెన్నై లో ఓ పవర్ ఫుల్ రోల్ గురించి చెప్పాను. కానీ ఆ సినిమా కుదరలేదు. నేను ముందు అనుకున్న వెర్షన్ కు ఆ పాత్ర ఉండగా.. ఆ తర్వాత మార్పులు చేశాను” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్ తర్వాత మహేష్ బాబును కలిసి ఓ కథ చెప్పానని.. కానీ ప్రాజెక్ట్ కూడా కుదరలేదని అన్నారు. ఇక అసురన్ మూవీ తర్వాత లాక్ డౌన్ అనంతరం జూనియర్ ఎన్టీఆర్ ను కలిశానని.. తనతో అనేక విషయాల గురించి మాట్లాడినట్లు తెలిపారు. కానీ తాను తారక్ తో సినిమా చేసేందుకు అసలు కథే రాసుకోలేదని.. అందుకు కొంత సమయం పడుతుందని అన్నారు.