AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas : ప్రభాస్ మళ్లీ మళ్లీ వినే రెండు పాటలు ఇవే.. ఆ సాంగ్ కోసం డైరెక్ట‏‏ర్‏కు కాల్ చేసి మరీ.. ఎంత బాగున్నాయి అసలు..

తెలుగు ఇండస్ట్రీలో జీవితాలకు దగ్గరగా ఉండే కథలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విలక్షణమైన దర్శకుడు వెంకటేశ్ మహా. సినిమాల్లో సాధారణ మనుషుల ఎమోషన్స్‌ని చాలా సహజంగా చూపిస్తూ, ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో వెంకటేశ్ మహా దర్శకుడిగా పరిచయమయ్యారు. సుమారు 80 మందికి పైగా కొత్త నటీనటులతో, విశాఖపట్నంలోని కంచరపాలెం నేపథ్యంలో తీసిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక క్లాసిక్‌గా నిలిచింది.

Prabhas : ప్రభాస్ మళ్లీ మళ్లీ వినే రెండు పాటలు ఇవే.. ఆ సాంగ్ కోసం డైరెక్ట‏‏ర్‏కు కాల్ చేసి మరీ.. ఎంత బాగున్నాయి అసలు..
Prabhas Song
Rajitha Chanti
|

Updated on: Jul 07, 2026 | 9:55 PM

Share

‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా. సినిమాలపై ఉన్న కసితో ‘బద్రీనాథ్’, ‘తీన్మార్’ వంటి చిత్రాలకు సెట్ బాయ్‌గా, జూనియర్ ఆర్టిస్ట్‌గా చిన్న చిన్న పనులు చేస్తూ తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన.. ప్రస్తుతం దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. వెంకటేష్ మహా సినిమాల్లో సహజత్వం ఎక్కువగా ఉంటుంది. లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్లు కాకుండా, మన పక్కింట్లో ఉండే వ్యక్తుల లాంటి పాత్రలనే ఆయన ఎంచుకుంటారు. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ ప్రయాణం, తన సినిమాల్లోని హిట్ సాంగ్స్‌పై టాలీవుడ్ టాప్ స్టార్స్ చూపించిన ప్రేమాభిమానాల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రంలోని “ఆశా పాశం” పాట ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ పాట గురించి మాట్లాడుతూ ఆయన ఎంతో గర్వపడ్డారు. గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూలో ఈ పాట లిరిక్స్ పాడటంపై వెంకటేష్ మహా స్పందిస్తూ.. “ఎన్టీఆర్ లాంటి ఒక పెద్ద స్టార్‌ను ఆ పాట అంతలా కదిలించిందంటే, ఆయన ఎంతటి గొప్ప మనసున్న మనిషో అర్థమవుతుంది” అని ఆనందం వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Athadu Movie : అతడు సినిమా హిట్ అవ్వడానికి కారణం ఆయనే.. నాజర్ కామెంట్స్..

అంతేకాకుండా, రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ పాటను ఎంతో ఇష్టపడతారని మహా రివీల్ చేశారు. ఒకసారి ప్రభాస్ ఆఫీస్ నుండి తనకు ఫోన్ వచ్చిందని, ప్రభాస్ నిత్యం “ఆశా పాశం”, “నింగి చుట్టే” పాటలను లూప్‌లో వింటుంటారని ఆయన టీమ్ చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తాను విజయవాడ, ఒరిస్సా పర్యటనల్లో బిజీగా ఉండటం వల్ల ప్రభాస్‌ను కలవలేకపోయానని, అంతటి పెద్ద స్టార్స్ స్క్రీన్ పైనే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎంతో అద్భుతమైన హ్యూమన్ బీయింగ్స్ అని అన్నారు. తొలత తాను ‘కేరాఫ్ కంచరపాలెం’ గ్రామంలో ఉన్నవారితో ఒక పిచ్ వీడియో చేశానని, దానికి ‘రంగస్థలం’ అనే టైటిల్ అనుకున్నట్లు మహా తెలిపారు. అయితే అదే సమయంలో సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్‌లో ‘రంగస్థలం’ టైటిల్ అనౌన్స్ అవ్వడంతో కాస్త ఆశ్చర్యపోయినా, తన ఫేవరెట్ టైటిల్ ఒక సీనియర్ డైరెక్టర్ సినిమాకు వెళ్లడం, దానికి సరైన న్యాయం జరగడం పట్ల సంతోషం వేసిందని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Aamir Khan: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. ఆమీర్ ఖాన్ తన మొదటి ఇద్దరు భార్యలకు ఎందుకు విడాకులు ఇచ్చారో తెలుసా.. ?

తన చిన్నతనం నుండే థియేటర్ల చుట్టూ తిరుగుతూ పెరిగానని, సెట్ బాయ్‌గా కెరీర్ ప్రారంభించి ఇక్కడి దాకా వచ్చానని చెప్పారు. తన ఆల్‌టైమ్ ఫేవరెట్ సినిమా ‘రుద్రవీణ’ అని పేర్కొన్న ఆయన, తనకు మళ్లీ మళ్లీ పని చేయాలనిపించే నటుడు సత్యదేవ్ అని స్పష్టం చేశారు. సత్యదేవ్ నీరు లాంటివాడని, ఏ పాత్రలో వేస్తే ఆ పాత్రలా మారిపోగల అద్భుతమైన నటుడని వెంకటేష్ మహా ప్రశంసించారు.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: అన్నయ్య నాకోసం ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. ఇప్పుడు ఇండస్ట్రీకే మొగుడయ్యాడు.. మురళి మోహన్..

ప్రభాస్ కు ఇష్టమైన పాటలు..

ఎక్కువ మంది చదివినవి : Cinema: ఫస్ట్ సినిమా చూసి ప్లాప్ అన్నారు.. కట్ చేస్తే.. 26 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు..

Follow Us