AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్రెస్టింగ్ స్టోరీ.. ఆ స్టార్ నటుడి ఇంటి నుంచి మందు బాటిల్స్ ఎత్తుకెళ్లిన త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్

వీరిద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ప్రతి సూపర్ హిట్ సినిమాలోనూ ఈ స్టార్ నటుడు ఉన్నాడు.సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ వీరి మధ్య మంచి అనుబంధం ఉంది. అలాంటి నటుడి గురించి ఒక సందర్భంలో త్రివిక్రమ్ ఇలా చెప్పుకొచ్చారు.

ఇంట్రెస్టింగ్ స్టోరీ.. ఆ స్టార్ నటుడి ఇంటి నుంచి మందు బాటిల్స్ ఎత్తుకెళ్లిన త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్
Trivikram Srinivas, Sunil
Basha Shek
|

Updated on: Sep 05, 2026 | 8:40 PM

Share

మాటల మాంత్రికుడు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాలతో పాటు అందులో ఆయన చెప్పిన పదునైన మాటలు, డైలాగులు చాలా బాగా గుర్తుండిపోతాయి. కేవలం సినిమాల్లోనే కాదు బయట కూడా త్రివిక్రమ్ ఉపన్యాసాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అందుకే సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లలోనూ త్రివిక్రమ్ చెప్పే మాటలు, ఇచ్చే స్పీచులు వినడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలా ఓ సినిమా ఈవెంట్ లో ఓ ప్రముఖ నటుడి గురించి ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. తాను రచయిత కాకముందే అర్ధరాత్రి 11-12 గంటలకు ఓ స్టార్ నటుడి ఇంటికి వెళ్లి తలుపు కొట్టి తినడానికి ఏమైనా ఉందా అని అడిగి, మందు బాటిళ్లు, చేతి వాచీలు కూడా తెలియకుండా తీసుకెళ్లేవాడినని చెప్పుకొచ్చారు. ఆ నటుడు తనను, సునీల్ ను బాగా భరించేవారంటూ గుర్తు చేసుకున్నారు. ఇంతకీ త్రివిక్రమ్ తో అంత సన్నిహితంగా మెలిగిన ఆ స్టార్ నటుడు ఎవరనుకుంటున్నారా? అతను మరెవరో కాదు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్.

త్రివిక్రమ్ తెరకెక్కించిన పలు సూపర్ హిట్ సినిమాల్లో ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించాడు. మొదటి సినిమా నువ్వే నువ్వే దగ్గరి నుంచి నువ్వు నాకు నచ్చావ్, అతడు, జల్సా, ఖలేజా, సన్నాఫ్ సత్యమూర్తి, గుంటూరు కారం.. ఇలా మాటల మాంత్రికుడు తెరకెక్కించిన పలు సూపర్ హిట్ సినిమాల్లో ప్రకాశ్ రాజ్ కీ రోల్స్ చేశాడు. ఈ నేపథ్యంలో నువ్వే నువ్వే సినిమా రీ యూనియన్ సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రకాశ్ రాజ్ తో తనకున్నఅనుబంధాన్నిఇలా పంచుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ‘ నిజం చెప్పాలంటే నన్ను చూస్తే ప్రకాశ్ రాజ్ భయపడేవారు. నేను ఇంటికి వచ్చినప్పుడల్లా ఇంట్లోంచి ఏదో ఒకటి పట్టుకుపోతానని ఆయన తెగ కంగారు పడేవారు (నవ్వుతూ). నేను రైటర్ కాకముందే అర్ధరాత్రి 11-12 గంటలకు ప్రకాష్ రాజ్ ఇంటికి వెళ్లి తలుపు కొట్టి తినడానికి ఏమైనా ఉందా అని అడిగి, మందు బాటిళ్లు, చేతి వాచీలు కూడా తెలియకుండా తీసుకెళ్లేవాడిని. నాతో పాటు సునీల్ ను ప్రకాశ్ రాజ్ ఎంతో భరించారు. బహుశా చిన్న చిన్న ఊళ్ల నుంచి వచ్చిన మా అమాయకత్వాన్ని ఆయన ఎంజాయ్ చేసి ఉండవచ్చేమో? ప్రకాశ్ రాజ్ తో నాకెప్పుడూ గొడవలు రాలేదు.. కానీ ఆయనపై ఎందుకు బ్యాన్ విధించారో అర్థం కాలేదు’ అని చెప్పుకొచ్చారు త్రివిక్రమ్. ఇవి పాత కామెంట్సే అయినా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us