Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి గురించి త్రివిక్రమ్ ఆసక్తికర కామెంట్స్.. వైరలవుతున్న వీడియో..

|

Jun 30, 2023 | 3:39 PM

ఈ మూవీ నుంచి పూజా హెగ్డే సైడ్ అయ్యిందంటూ టాక్ నడుస్తుంది. ఈ చిత్రానికి ఇచ్చిన డేట్స్ పూజా అడ్జస్ట్ చేయలేకపోయిందని.. దీంతో ఆమెను ఈ సినిమా నుంచి తొలగించారని టాక్ నడుస్తుంది. ఇక ఆమె స్థానంలోకి మరో హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక వార్తలపై అటు పూజా.. ఇటు చిత్రయూనిట్ స్పందించకపోవడంతో ఈ రూమర్స్ నిజమని తెలుస్తోంది.

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి గురించి త్రివిక్రమ్ ఆసక్తికర కామెంట్స్.. వైరలవుతున్న వీడియో..
Meenakshi Choudhary
Follow us on

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకులలో క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పటికే సగం చిత్రీకరణ కంప్లీట్ అయిన ఈ సినిమా గురించి నిత్యం రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముందుగా ఈ సినిమా నుంచి మ్యూజిక్ థమన్ తప్పుకున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే ఈ రూమర్స్ పై పరొక్షంగా స్పందిస్తూనే క్లారిటీ ఇచ్చారు థమన్. ఇక ఈ మూవీ నుంచి పూజా హెగ్డే సైడ్ అయ్యిందంటూ టాక్ నడుస్తుంది. ఈ చిత్రానికి ఇచ్చిన డేట్స్ పూజా అడ్జస్ట్ చేయలేకపోయిందని.. దీంతో ఆమెను ఈ సినిమా నుంచి తొలగించారని టాక్ నడుస్తుంది. ఇక ఆమె స్థానంలోకి మరో హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక వార్తలపై అటు పూజా.. ఇటు చిత్రయూనిట్ స్పందించకపోవడంతో ఈ రూమర్స్ నిజమని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా గతంలో మీనాక్షి గురించి త్రివిక్రమ్ మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. మీనాక్షి తొలి చిత్రం ఇచ్చట వాహనములు నిలపరాదు ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా త్రివిక్రమ్ వెళ్లారు.. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. మీనాక్షి త్వరలోనే బిజీ హీరోయిన్ అయిపోతుంది.. టాప్ పొజీషన్ లో ఉంటుందని.. అప్పుడు తనకు డేట్స్ ఇవ్వాలంటూ త్రివిక్రమ్ కోరాడు. అప్పుడు సరదాగా అన్నా కూడా ఇప్పుడు అదే నిజమయ్యిందని.. రెండేళ్ల క్రితమే మీనాక్షిని త్రివిక్రమ్ డేట్స్ అడిగాడు అంటూ వీడియోను షేర్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ మూవీపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇందులో మీనాక్షితోపాటు.. శ్రీలీల సైతం సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీ పూర్తైన తర్వాత మహేష్ రాజమౌళి మూవీ పట్టాలెక్కనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.