Trinadha Rao Nakkina : ఆ రెండు సినిమాలు ఆగిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన

|

Jul 01, 2021 | 7:37 AM

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో త్రినాథ్ రావు నక్కిన ఒకరు. యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన సినిమా చూపిస్త మామ అనే సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తిపు తెచ్చుకున్నారు.

Trinadha Rao Nakkina : ఆ రెండు సినిమాలు ఆగిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన
Trinadha Rao Nakkina
Follow us on

Trinadha Rao Nakkina : టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో త్రినాథ్ రావు నక్కిన ఒకరు. యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన సినిమా చూపిస్త మామ అనే సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తిపు తెచ్చుకున్నారు.ఈ సినిమా యూత్ ను ఆకట్టుకుంది. ఆతర్వాత నాని నటించిన నేను లోకల్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ తో ‘హలొ గురు ప్రేమ కోసమే’ అనే సినిమా చేశారు.కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఇలా చేసిన తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రినాథ్ రావు నక్కిన… ఇప్పడు రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఆ రెండు సినిమాలు కూడా స్టార్ హీరోలతోనే అవ్వడం విశేషం. రామ్ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న త్రినాథ్ రావు రవితేజ తో ఓ సినిమా అలాగే సీనియర్ హీరో వెంకటేష్ తో ఓ సినిమాను ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ రెండు ప్రాజెక్ట్స్ ఆగిపోయాయని ఈ మధ్య వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. దాంతో త్రినాథ్ రావు స్పందించాల్సి వచ్చింది.

ఇటీవల ఆయన మాట్లాడుతూ.. రవితేజ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం రవితేజ బిజీగా ఉన్నారు. ఆయన ఎప్పుడంటే అప్పుడు సెట్స్ పైకి వెళ్లొచ్చు అన్నారు. అలాగే వెంకటేశ్ తో ప్రాజెక్టు కూడా ఆగలేదు. ఆ కథ క్లైమాక్స్ గురించిన చర్చలు నడుస్తున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు తప్పకుండా ఉంటాయి. అని క్లారిటీ ఇచ్చారు. మాస్ రాజా రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే వెంకటేష్ అసురన్ రీమేక్ నారప్ప సినిమా చేస్తున్నాడు. దీనితోపాటు వెంకటేష్ చేతిలో ఎఫ్3 సినిమా ఉంది. ఈ హీరోలు ఆయా సినిమాలు పూర్తి చేసిన తర్వాత త్రినాథ్ రావు తో సినిమాను పట్టాలెక్కించనున్నారు.

మారిన్ని ఇక్కడ చదవండి:

Mahesh Babu-Rajamouli : మహేష్ తో జక్కన మాస్టర్ ప్లాన్.. సూపర్ స్టార్ తో రాజమౌళి అలాంటి స్టోరీ చేయబోతున్నారా..?

Ram Charan: ఆర్ఆర్ఆర్ సెట్ లో చెర్రీతో అంత క్లోజ్‏గా ఉన్న ఆ బుడ్డోడు ఎవరో తెలుసా…?? ( వీడియో )

Rakul Preet Singh: టాలీవుడ్‏ లో బిజీ కానున్న రకుల్.. బాలయ్యకు జోడిగా ఢిల్లీ బ్యూటీ..