
కన్నడ హీరో యాక్షన్ అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్నాళ్లు హీరోగా వెండితెరపై సందడి చేసిన ఆయన.. ఇప్పుడు విలన్ పాత్రలలోనూ అదరగొట్టేస్తున్నారు. అయితే నటుడిగా తెలుగు సినీ ప్రియులకు సుపరిచితమైన అర్జున్.. ఇప్పుడు దర్శకుడిగా మారారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న లేటేస్ట్ మూవీ సీతా పయనం. ఇందులో అర్జున్ సర్జాతోపాటు ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్, నిరంజన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ వేడుకకు పుష్ప మూవీ డైరెక్టర్ సుకుమార్, కన్నడ హీరో ఉపేంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ కన్నడ హీరో ఉపేంద్ర పై ప్రశంసలు కురిపించారు. అలాగే ఆయన సినిమాలు తనపై చూపించిన ప్రభావం గురించి వివరించారు.
సుకుమార్ మాట్లాడుతూ.. “ఉపేంద్ర తెరకెక్కించిన A సినిమాను చూశాను. అలాగే ఓం చిత్రాన్ని సైతం చూశా. ఇండియాలో ఏ దర్శకుడు సైతం అంత పిచ్చిగా, మ్యాడ్ గా, కన్ఫ్యూజింగ్ సినిమాలను రూపొందించలేదు. ఇప్పటికీ A సినిమా చూస్తే అలాగే అనిపిస్తుంది. A, ఓం, ఉపేంద్ర.. ఈ మూడు సినిమాలు తీసిన ఏ డైరెక్టర్ అయినా రిటైర్ అయిపోవచ్చు. ఒకవేళ ఆ మూడు సినిమాలు చేస్తే నేను ఎప్పుడో రిటైర్ అయిపోయేవాడిని” అంటూ చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా తన సినిమాల్లో స్క్రీన్ ప్లే ఇంత కల్ట్ గా ఉండడానికి కారణం ఉపేంద్ర తెరెక్కించిన ఆ మూడు సినిమాలే అని.. ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆశ్యర్చపరచడం తనకు అలవాటని అన్నారు. ఈ విషయాన్ని ఉపేంద్ర నుంచే తాను దొంగిలించానని అన్నారు. ప్రస్తుతం సుకుమార్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తాను సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడే అర్జున్ సర్జాను దగ్గర నుంచి చూశానని.. ఎప్పుడూ కూల్ గా ఉంటారని.. ఇప్పటికీ ఆయన అలాగే కనిపిస్తున్నారని.. అర్జున్, ఉపేంద్రతో కలిసి వేదికను పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..