పుష్పలో అడిగిన కూడా నాకు ఛాన్స్ ఇవ్వలేదు.. సుకుమార్ కూతురు షాకింగ్ కామెంట్స్

పుష్ప 2 సినిమాతో సుకుమార్ పేరు మరోసారి మార్మోగిపోయింది. ఆయన తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ. 1850 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తద్వారా భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో సినిమాగా రికార్డుల కెక్కింది. ఇప్పుడు సుకుమార్ సినిమా వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కూతురు సుకృతి వేణి సినిమాల్లోకి అడుగు పెట్టింది.

పుష్పలో అడిగిన కూడా నాకు ఛాన్స్ ఇవ్వలేదు.. సుకుమార్ కూతురు షాకింగ్ కామెంట్స్
Sukumar

Updated on: Jan 17, 2025 | 7:18 PM

తెలుగు సినిమా దర్శకులు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకుంటున్నారు. వీరిలో మొదటిగా చెప్పాల్సిన పేరు రాజమౌళి. ఆ తర్వాత చెప్పే పేరు సుకుమార్. రీసెంట్ గా ‘పుష్ప 2’ సినిమాతో రికార్డులు సృష్టించిన సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్య సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు సుకుమార్. తొలి సినిమాతోనే మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఆతర్వాత వరుసగా దర్శకుడిగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. జగడం, ఆర్య 2,100% లవ్,1 – నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప: ది రైజ్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్న సుకుమార్ పుష్ప 2తో సంచలన విజయం అందుకున్నారు.

ఇది కూడా చదవండి : పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని లేదు.. నాకు ఇప్పటికే ఓ బిడ్డ ఉన్నాడు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్

సుకుమార్ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు ఓ నటి, దర్శకులు, నిర్మాత వచ్చారు. సుకుమార్ భార్య నిర్మాత, సుకుమార్ కూతురు దర్శకురాలిగా, నటిగా సినీ రంగ ప్రవేశం చేసింది.గాంధీ తాత చట్టం అనే సినిమాతో సుకుమార్ కూతురు నటిగా సినిమాల్లోకి అడుగుపెట్టారు. కానీ సుకుమార్ ఎంత స్ట్రిక్ట్ పర్సనాలిటీ అంటే అడిగినా కూడా తన సొంత కూతురికి ‘పుష్ప’ సినిమాలో రోల్ ఇవ్వలేదట.

ఇది కూడా చదవండి :నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే సినిమాలు నేను చేయాల్సినవి.. యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్

సుకుమార్ కూతురు నటించిన ‘గాంధీ తాత చట్టం’ చిత్రం జనవరి 24న విడుదలవుతుండగా, సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా చిత్ర బృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మీడియా సమావేశానికి సుకుమార్ స్వయంగా జర్నలిస్టుగా హాజరయ్యారు. ఈ సమయంలో సుకుమార్ అడిగిన ప్రశ్నలకు ఆమె కూతురు సుకృతి వేణి చెప్పిన సమాధానాలు ప్రేక్షకులకు నవ్వు తెప్పించాయి. అలాగే మీ నాన్నగారి సినిమాల్లో ఎందుకు నటించలేదు? అని ఒక విలేకరి అడిగాడు. దానికి సుకృతి వేణి సమాధానమిస్తూ.. ‘పుష్ప’, ‘పుష్ప 2’ సినిమాల్లో పాత్ర కోసం నేను అడిగాను, కానీ మా నాన్న నాకు ఆ పాత్ర ఇవ్వలేదు అని చెప్పింది. ఆ తర్వాత సుకుమార్ స్వయంగా జర్నలిస్టులా కొన్ని ప్రశ్నలు సంధించారు. సుకృతి తన తండ్రి ప్రశ్నలకు సమాధానమిస్తూ చివర్లో ‘మీ పేరు నాకు తెలియదు’ అని సరదాగా అనడం విలేకరుల సమావేశంలో హైలైట్‌గా నిలిచింది. ‘గాంధీ తాత చట్టం’ సినిమా ఓ స్కూల్‌ అమ్మాయి కథ. ఓ అమ్మాయి మొక్కను కాపాడే కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రానికి పద్మావతి మల్లాది దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి