Balakrishna: భైరవద్వీపంలోని ఆ గెటప్ కోసం బాలకృష్ణ ఎంత కష్టపడ్డారో తెలుసా ?.. ఆ విషయంలో చాలా సీరియిస్‏గా..

|

Sep 06, 2022 | 5:22 PM

అసిస్టెంట్ డైరెక్టర్‏గా కెరీర్ ఆరంభించానని.. ఎన్టీఆర్ ను కృష్ణుడిగా చూడడం అనేది ఒక అద్భుతమంటూ చెప్పుకొచ్చారు. అలాగే పుష్పక విమానం సినిమా స్టోరీ అద్భుతంగా ఉందని అందరూ మెచ్చుకున్నారు.

Balakrishna: భైరవద్వీపంలోని ఆ గెటప్ కోసం బాలకృష్ణ ఎంత కష్టపడ్డారో తెలుసా ?.. ఆ విషయంలో చాలా సీరియిస్‏గా..
Singeetham Srinivasrao
Follow us on

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల మనసులో ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నారు డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao). ఆయన రూపొందించిన సినిమాలు ఇప్పటికీ సినీప్రియులకు సరికొత్త అనుభూతినిస్తాయి. కేవలం దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా.. రచయితగా.. నటుడిగా.. సంగీత దర్శకుడిగా.. గాయకుడిగా అన్ని రంగాల్లోనూ మెప్పించిన దక్షిణాది చిత్రపరిశ్రమలో తిరుగులేని దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. గత కొద్దిరోజులుగా వెండితెరకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల ఆలీతో సరదాగా షోలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితం.. సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం తన వయసు 92 అని.. కానీ మానసికంగా తన వయసు 25 అంటూ నవ్వులు పూయించారు. అసిస్టెంట్ డైరెక్టర్‏గా కెరీర్ ఆరంభించానని.. ఎన్టీఆర్ ను కృష్ణుడిగా చూడడం అనేది ఒక అద్భుతమంటూ చెప్పుకొచ్చారు. అలాగే పుష్పక విమానం సినిమా స్టోరీ అద్భుతంగా ఉందని అందరూ మెచ్చుకున్నారు. కానీ నిర్మించేందుకు ఎవరు ముందుకు రాలేదంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన సింగీతం శ్రీనివాసరావు చిత్రాల్లో భైరవ ద్వీపం ఒకటి. క్రేజీ ఫాంటసీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ఆరోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో బాలకృష్ణ, రోజా జంటగా నటించారు. ఇందులో బాలయ్య కురుపి గెటప్ లో కనిపించారు. ఈ గెటప్ కోసం ఆయన దాదాపు 10 రోజులు కష్టపడ్డారని . ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ పాత్రలోనే ఉండాల్సి వచ్చిందని.. దీంతో ఆహారం తీసుకోవడం కష్టంగా ఉండడంతో కేవలం జ్యూసెస్ మాత్రమే తీసుకున్నారని తెలిపారు. అలా దాదాపు పది రోజులు షూటింగ్‏లో పాల్గొన్నారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

Balakrishna

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.