Dhanush: ధనుష్ అలా మాట్లాడతాడనుకోలేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన శేఖర్ కమ్ముల

స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ స్టార్ హీరో. ధనుష్ చాలా వేగంగా సినిమాలు చేస్తుంటాడు. తెలుగు, తమిళ్, హిందీ బాషలతో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

Dhanush: ధనుష్ అలా మాట్లాడతాడనుకోలేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన శేఖర్ కమ్ముల
Dhanush, Sekhar Kammula

Updated on: Jan 22, 2025 | 11:48 AM

స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు. తెలుగు, తమిళ్, హిందీలో సినిమాలు చేస్తున్నాడు. అంతే కాదు హాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తున్నాడు ధనుష్. నటుడు ధనుష్ నటించిన రాయన్ చిత్రం రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ధనుష్ 50వ చిత్రంగా వచ్చిన రాయన్ సినిమాకు స్వయంగా ధనుష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు సెల్వరాఘవన్, ఎస్‌జె సూర్య, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, తుషార విజయన్, అపర్ణ బాలమురళి, శరవణన్ నటించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సినిమాలోని అన్ని పాటలకు అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది.

ఈ సినిమా విజయం తరువాత, నటుడు ధనుష్ టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ములతో సినిమా చేస్తున్నాడు. గతంలో  ధనుష్ టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ సినిమాలో నటించాడు. ఈ చిత్రానికి అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీని తర్వాత ధనుష్ ఇప్పుడు శేఖర్ కమ్ములతో కలిసి పనిచేస్తున్నాడు. కుబేర అనే టైటిల్ తో రూపొందిన ఈ సినిమా పోస్టర్ నుంచే అంచనాలను క్రియేట్ చేసింది. తొలి పోస్టర్‌లో ధనుష్ బిచ్చగాడిలా కనిపించాడు. ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు రష్మిక మందన,  నాగార్జున ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడు శేఖర్ కమూల మాట్లాడుతూ.. నటుడు ధనుష్ తో తొలిసారి మాట్లాడినప్పుడు ఆశ్చర్యపోయాను అని అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కుబేర చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ మూవీ షూటింగ్ తిరుపతి, ముంబై, థాయ్‌లాండ్‌లో పూర్తి కాగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఫైనల్ షూటింగ్ జరుగుతోంది. ధనుష్ పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు చిత్ర వర్గాల సమాచారం.కాగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. కుబేర కథ రాసుకున్న తర్వాత ముందుగా ధనుష్ కి కథ చెప్పాలి. ఆయన ఈ సినిమా చేస్తే బాగుంటుందని అనుకున్నాను. కానీ ధనుష్ తో నాకు పరిచయం లేదు. ఆయనతో ఎలా మాట్లాడాలి అని ఆలోచించా.. ధనుష్‌కి ఫోన్ చేసి ఫోన్‌లో ముందుగా పరిచయం చేసుకుందాం అని ఆయనకు ఫోన్ చేసి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. కానీ నన్ను పరిచయం చేసుకున్న వెంటనే ఆయన నేను ఇంతకు ముందు దర్శకత్వం వహించిన సినిమాల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. అది విని నేను షాక్ అయ్యాను అని ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. ఆ కామెంట్స్ ఇప్ప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.