Major Movie: సందీప్ గురించి అందరికీ తెలిసేందుకే మేజర్ సినిమా చేశాను.. డైరెక్టర్ శశి కిరణ్ తిక్క కామెంట్స్ వైరల్..
తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్ టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో
డైరెక్టర్ శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం మేజర్ (Major). 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్ టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. ఈ సందర్భంగా దర్శకుడు శశి కిరణ్ తిక్క బుధవారంనాడు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మేజర్ చిత్రం ఎలా మొదలైందని విలేకరి అడగ్గా.. డైరెక్టర్ శశి కిరణ్ మాట్లాడుతూ.. ” అడవి శేష్ వల్లే మొదలైంది. 2010నుంచి మేం స్నేహితులం. నేను అసిస్టెంట్గా ప్రయత్నాలు చేస్తున్నా. తను హీరోగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఓసారి మాటల్లో మేజర్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాడు. ఆ తర్వాత రెండు కథలు అనుకున్నాం. కానీ సాధ్యపడలేదు. ఆఖరికి 2016లో గూఢచారి మొదలు పెట్టాం. అది విడుదలై మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఎవరు సినిమాలు వారివి అనేలా బ్రేక్ తీసుకున్నాం. నేను వేరే నిర్మాణ సంస్థలోకి వెళ్ళాను. కొన్నాళ్ళకు శేష్, సహ నిర్మాత శరత్, నమ్రత, సోని సంస్థను కలిపి ఒక వేదికపై తీసుకువచ్చారు. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి సినిమా గురించి చెప్పాడు. చేసేయ్ అన్నా. చేయడంకాదు. ఈ సినిమా నువ్వే దర్శకత్వం వహించాలి అన్నాడు. నేను కాస్త బ్రేక్ తీసుకుందాం అనుకున్నానని చెప్పినా వినలేదు. నువ్వే కరెక్ట్ అన్నాడు. దాంతో కొంత సమయం తీసుకుని చెబుతాను అన్నాను. ఆ సమయంలో మేజర్ గురించి స్టడీ చేశాను. ఆ క్రమంలో ఆ పాత్ర నన్ను బాగా ఆకట్టుకుంది. 26/11 ఎటాక్ లో ఎంతోమందిని కాపాడిన వ్యక్తి. ఎంతో నాలెడ్జ్ వున్న పర్సన్. దాంతో ఈ విషయం అందరికీ తెలియజేయాలనే నేనే సినిమా చేస్తానని శేష్ తో చెప్పాను. అలా సినిమా మొదలైంది.” అంటూ చెప్పుకొచ్చారు.