సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో ముందు వరసలో ఉంటారు దర్శకుడు శంకర్. ఈయన భారీ సినిమాలను పెట్టింది పేరు. ఒకప్పుడు శంకర్ తెరకెక్కించిన సినిమాలు అన్నీ దాదాపు సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఈ మధ్య ఆయన సినిమాలు ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాయి. దళపతి విజయ్ తో చేసిన స్నేహితుడు సినిమా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా ‘త్రీ ఇడియట్స్’ మూవీ రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు శంకర్. అలాగే విక్రమ్ తో చేసిన ఐ సినిమాకూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ ప్రయోగాత్మక చిత్రంలో విక్రమ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేసిన రోబో2.o కూడా బెడిసి కొట్టింది. దాంతో ఇప్పుడు ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని ఇండియన్ 2 ను అనౌన్స్ చేసాడు శంకర్. గతంలో శంకర్ -కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన ఇండియన్ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టిన దగ్గర నుంచి అనుకోని అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి.
ఇండియన్ 2 సినిమా పెండింగ్ వర్క్ అంతా ఒక్క నెలలో కంప్లీట్ చేయాలి.. ఇది దర్శకుడు శంకర్‌కు ప్రొడక్షన్ హౌస్ లైకా పెట్టిన కండిషన్. ఈ విషయం మీదే కోర్టుకు కూడా వెళ్లింది లైకా. ఇప్పటికే సినిమా చాలా ఆలస్యమైందన్న నిర్మాతలు.. ఎట్టి పరిస్థితుల్లో సినిమా జూన్‌లో పూర్తి చేయాలని పట్టుబడుతున్నారు. అయితే ఈ విషయంలో శంకర్ వర్షన్ మాత్రం మరోలా ఉంది. ఇంత భారీ చిత్రాన్ని ఒక్క నెలలో పూర్తి చేయటం కష్టం అంటున్నారు. జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో షూటింగ్ పూర్తి చేస్తానని చెబుతున్నారు. అంతేకాదు కామెడియన్ వివేక్ మరణంతో కొన్ని సీన్స్ రీ షూట్ చేయాల్సి ఉందని.. కాబట్టి నెల రోజుల టైం అస్సలు సరిపోదంటున్నారు డైరెక్టర్.తరువాత సెట్‌లో యాక్సిడెంట్‌తో తారా స్థాయికి చేరాయి.. డైరెక్టర్ శంకర్ కూడా కొంతకాలంగా సినిమాకు దూరంగా ఉంటూ కొత్త సినిమాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇంతలో ముగిసింది అనుకున్న భారతీయుడు సీక్వల్ వివాదం కోర్టు వరకు వెళ్ళింది. ప్రస్తుతం శంకర్ కు అటు లైకా ప్రొడక్షన్స్ వారికీ హోరాహోరి పోరు జరుగుతుంది. ఇప్పుడు శంకర్ మరో సినిమా అనౌన్స్ చేయటంతో.. సీన్ శంకర్ వర్సెస్ లైకా అన్నట్టుగా మారింది. ఇండియన్ 2 పూర్తయ్యే వరకు వేరే సినిమాలకు దర్శకత్వం వహించకుండా శంకర్ ను ఆదేశించాలని కోర్టును కోరింది లైకా. ఇప్పటికే ఈ సినిమాకు రూ.236 కోట్లు ఖర్చు చేశామని.. శంకర్ కు రెమ్యూనరేషన్ గా మాట్లాడుకున్న రూ.40 కోట్లలో రూ.14 కోట్లు చెల్లించామని నిర్మాణ సంస్థ కోర్టుకు తెలిపింది. మంగళవారం జరిగిన వాదనలో ‘ఇండియన్-2’ సినిమా లేట్ అవడానికి నిర్మాణ సంస్థ లైకానే కారణమని డైరెక్టర్ శంకర్ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. మరి ఈవివాదం ఎప్పుడు ముగుస్తుందో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :