Ram Gopal Varma: సంచలన దర్శకుడు ఆర్జీవీ మరోసారి తన ట్విట్టర్ కు పని చెప్పారు. నిత్యం వివాదాల్లో మునిగి తేలే వర్మ ఈ సారి టాలీవుడ్ పెద్దలను టార్గెట్ చేశారు. ఇప్పటికే సినిమా టికెట్స్ ధరల పెంపు పై ఏపీ ప్రభుత్వం పై తనదైన శైలిలో సెటైర్లు వేసిన వర్మ.. ఆ తర్వాత ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని పై కూడా ట్వీట్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత పేర్ని నాని వర్మకు అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో.. ప్రత్యేకంగా ఆయనను కలిసి మరి ఈ విషయం పై డిస్కస్ చేశారు వర్మ. ఇక రీసెంట్ గా టాలీవుడ్ ప్రముఖులు.. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణ మూర్తి, పోసాని, అలీ ఇలా పలువురు ఏపీ సీఎం జగన్ ను కలిసి సినిమా ఇండస్ట్రీ సమస్యలను వివరించారు. అలాగే టికెట్ల ధర విషయం పైన కూడా చేర్చించారు.
టాలీవుడ్ సమస్యలను విన్న జగన్.. సానుకూలంగా స్పందించారు. జగన్ తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన టాలీవుడ్ బృందం సీఎం జగన్ నిర్ణయం సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. టికెట్ ధరలపై ఇక శుభం కార్డు పడినట్లు తాము భావిస్తున్నామని చెప్పారు. చిన్న సినిమాలకు కూడా ఐదో షోకు అనుమతివ్వడం మంచి పరిణామమని అన్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధించి ఈనెలాఖరులోనే జీవో వస్తుందని భావిస్తున్నాము అని తెలిపారు. ఇప్పుడు ఈ విషయం పై ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఏపీ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య ఉన్న ఐస్ ను బ్రేక్ చేసినందుకు జగన్ గారిని విపరీతంగా అభినందిస్తున్నాను.. భవిష్యత్తులో సంతోషకరమైన ప్రయాణానికి మార్గం వేసినందుకు థాంక్స్ అంటూ ట్వీట్ చేశారు వర్మ.. అంతకు ముందు ‘ఓ మెగా ఫ్యాన్‌గా ఈ మెగా బెగ్గింగ్ చూసి చాలా బాధ పడ్డా’ అని ట్వీట్ చేశారు వర్మ.. ఆ తర్వాత ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు. తాజాగా జగన్ పై ఇలా ప్రశంసలు కురిపించారు.
I tremendously appreciate @ysjagan Garu for breaking the ice between the presumed tensions between AP government and Telugu film industry and laying a path for a happy journey in the future ???
— Ram Gopal Varma (@RGVzoomin) February 11, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :