AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతనికంటే లక్ష ఎక్కువ ఇస్తేనే చేస్తా అని చెప్పా.. షాకింగ్ విషయం చెప్పిన రవిబాబు

విలక్షణ నటనకు, వెర్సటైల్ స్టోరి టెల్లింగ్‌కు దర్శకుడు రవిబాబు పెట్టింది పేరు. సీనియర్ నటుడు చలపతిరావు కోడుకైనప్పటికీ.. ఇండస్ట్రీలో అటు నటుడిగా.. ఇటు దర్శకుడిగా నిలదొక్కుకునే క్రమంలో రవిబాబు పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ విషయాలు అతడు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

అతనికంటే లక్ష ఎక్కువ ఇస్తేనే చేస్తా అని చెప్పా.. షాకింగ్ విషయం చెప్పిన రవిబాబు
Ravibabu
Rajeev Rayala
|

Updated on: Feb 04, 2026 | 8:34 PM

Share

తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రవిబాబు. గతంలో ఓ ఇంటర్వ్యూలో రవిబాబు తన కెరీర్‌లోని కొన్ని ఆసక్తికర విషయాలను, చేదు అనుభవాలను పంచుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో స్థానిక నటుల కంటే ఇతర భాషల నటులకు ప్రాధాన్యత ఇవ్వడంపై రవిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మన నటులు అందుబాటులో ఉన్నా, బయటి నుండి నటులను తీసుకొచ్చి, వారికి తెలుగు డైలాగులు రాక కష్టపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు రవిబాబు. నితిన్ హీరోగా నటించిన విక్టరీ చిత్రంలో తనకు లాయర్ పాత్ర కోసం సురేష్ రెడ్డి అనే వ్యక్తి  అడిగారని అప్పుడు జరిగిన ఓ సంఘటనను పంచుకున్నారు రవిబాబు.

నితిన్ హీరోగా, ఆర్ ఆర్ మూవీ మేకర్స్ నిర్మించిన విక్టరీ చిత్రంలో అశుతోష్ రాణా అనే హిందీ నటుడికి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుసుకుని, రవిబాబు గట్టిగా ప్రశ్నించారట. నాకు తెలుగు వచ్చు, అశుతోష్ రాణాకి తెలుగు రాదు. నా ఇంట్లో నేను ఉంటాను, బిజినెస్ క్లాసులో ఢిల్లీ నుంచో, బాంబే నుంచో రాను. నాకు మేకప్ మేన్, అసిస్టెంట్ లేరు, నా కారు నేను వేసుకొని వస్తాను. ఆంధ్రప్రదేశ్‌లో అతని కంటే 100 రెట్లు ఇమేజ్ నాదే ఎక్కువ అలాంటప్పుడు.. అయినప్పటికీ, తనకంటే అతనికి ఎక్కువ డబ్బులు ఎందుకు ఇస్తున్నారని నిలదీశారట. తన వాదనకు ఆ నిర్మాత దగ్గర సమాధానం లేదని, అతని కంటే చివరకు లక్ష రూపాయలు ఎక్కువ ఇస్తేనే చేస్తానని చెప్పి, ఆ సినిమా చేశానని రవిబాబు గుర్తు చేసుకున్నారు.

ఇక్కడ చాలా మంది టాలెంటెడ్ నటులు ఉన్నప్పుడు, ఇతర భాషల నుండి తక్కువ అర్హత కలిగిన నటులను ఎందుకు తీసుకువస్తున్నారని అన్నారు రవిబాబు. దీనికి ఉదాహరణగా, లెజెండ్ సినిమాలో అద్భుతమైన విలన్ పాత్ర పోషించిన జగపతి బాబును ప్రస్తావించారు. జగపతి బాబు మంచి ఆర్టిస్ట్ అని రవిబాబు అన్నారు. జగపతి బాబు వంటి తెలుగు నటులు అందుబాటులో ఉన్నా, మలయాళం, తమిళం నుండి విలన్లను ఎందుకు తీసుకువస్తున్నారని ప్రశ్నించారు. రవిబాబు తన లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీలో పెద్దగా ఎవరితోనూ మాట్లాడానని, పబ్లిక్ ప్లేస్‌లకు, ఫంక్షన్లకు వెళ్ళనని చెప్పారు. ఇద్దరు ముగ్గురితో మాత్రమే తన ఇంటరాక్షన్ పరిమితమని తెలిపారు. పెద్ద కమర్షియల్ దర్శకులు తనకు వేషాలు ఇవ్వరని, వారి ఫోన్లు ఎప్పుడూ రాలేదని ఆయన అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
ఇంటి ముందు డైలీ కళ్లాపి చల్లుతున్నారా..? అయితే జాగ్రత్త..
ఇంటి ముందు డైలీ కళ్లాపి చల్లుతున్నారా..? అయితే జాగ్రత్త..
భోజనం చేసే ముందు దేవుడిని ఎందుకు స్మరించుకోవాలి? ఈ భారతీయ..
భోజనం చేసే ముందు దేవుడిని ఎందుకు స్మరించుకోవాలి? ఈ భారతీయ..
ఆ రూమ్‌లోకి వెళ్తే ప్రాణాలతో తిరిగి రాలేరు.. అస్సలు మిస్ అవ్వకండి
ఆ రూమ్‌లోకి వెళ్తే ప్రాణాలతో తిరిగి రాలేరు.. అస్సలు మిస్ అవ్వకండి
మైథాలజీకి యానిమేషన్.. బాక్సాఫీస్ న్యూ సెన్సేషన్..!
మైథాలజీకి యానిమేషన్.. బాక్సాఫీస్ న్యూ సెన్సేషన్..!
భారత్‌లో మరో రూ.2,800 కోట్లకు పైగా పెట్టుబడి.. ఆస్ట్రేలియా సంస్థ
భారత్‌లో మరో రూ.2,800 కోట్లకు పైగా పెట్టుబడి.. ఆస్ట్రేలియా సంస్థ
రేపే యోగిని ఏకాదశి ఈ 4 తప్పులు చేస్తే వ్రతం భంగమే.. విష్ణుమూర్తి
రేపే యోగిని ఏకాదశి ఈ 4 తప్పులు చేస్తే వ్రతం భంగమే.. విష్ణుమూర్తి
అయ్యో..ఎంత పనాయేరా.. దోస్త్ గానీ వాట్సాప్ స్టేటస్ చూసి దొంగతనం..
అయ్యో..ఎంత పనాయేరా.. దోస్త్ గానీ వాట్సాప్ స్టేటస్ చూసి దొంగతనం..
నాని తెలిసే చేస్తున్నారా.. ఫస్ట్ టైమ్ ఆ కన్ఫ్యూజన్..!
నాని తెలిసే చేస్తున్నారా.. ఫస్ట్ టైమ్ ఆ కన్ఫ్యూజన్..!
ఫౌజీ షూటింగ్‏లో నటుడికి విషపురుగు కాటు పై టీమ్ క్లారిటీ..
ఫౌజీ షూటింగ్‏లో నటుడికి విషపురుగు కాటు పై టీమ్ క్లారిటీ..
వరద నీటిలో కొట్టుకువచ్చిన వందలాది పాములు.. వణుకుతున్న జనం!
వరద నీటిలో కొట్టుకువచ్చిన వందలాది పాములు.. వణుకుతున్న జనం!