Ram Gopal Varma : ఫోన్లలోనే అన్నీ .. సినిమాల్లో కట్స్ ఎందుకు..? సెన్సార్ బోర్డ్ పై రామ్ గోపాల్ వర్మ ట్వీట్..

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పక్కర్లేదు. తాజాగా విజయ్ దళపతి నటించిన జన నాయగన్ సినిమాతోపాటు పలు సినిమాలకు సెన్సార్ బోర్డ్ నుంచి వస్తున్న అభ్యంతరాలపై స్పందించారు ఆర్జీవి. అసలు ఈరోజుల్లో ఫోన్స్ లోనే అందరూ అన్నీ చూస్తున్న రోజులని.. అలాంటి సమయాల్లో సినిమాల్లో కట్స్ ఎందుకు అని ప్రశ్నించారు.

Ram Gopal Varma : ఫోన్లలోనే అన్నీ .. సినిమాల్లో కట్స్ ఎందుకు..? సెన్సార్ బోర్డ్ పై రామ్ గోపాల్ వర్మ ట్వీట్..
Ram Gopal Varma

Updated on: Jan 10, 2026 | 10:53 AM

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పక్కర్లేదు. ట్రెండింగ్ అంశాలపై నిత్యం స్పందించే ఆర్జీవీ.. తాజాగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సెన్సార్ బోర్డ్ పై.. దాని పనితీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో సెన్సార్ బోర్డ్ అనేది కాలం చెల్లిన వ్యవస్థ అని.. దాని ఉనికి ఒక పెద్ద జోక్ అని ఆయన తెలిపారు. కొన్ని రోజులుగా విజయ్ నటిస్తున్న జన నాయగన్ సినిమా సెన్సార్ వివాదంపై ఆయన ట్వీట్ చేశారు. ఈరోజుల్లో సెన్సార్ బోర్డుకు ఇంకా ప్రాముఖ్యత ఉందని తాను భావించడం లేదని అన్నారు. దాని అవసరం ఎప్పుడో తీరిపోయిందని.. కానీ దానిపై చర్చంచే బద్ధకంతో ఇంకా కొనసాగిస్తున్నారని అన్నారు. ఇందుకు ప్రధాన బాధ్యత చిత్ర పరిశ్రమదే అని వర్మ అన్నారు.

ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..

ప్రస్తుతం ఫోన్ లోనే విపరీతమైన భావజాలాన్ని, కుట్ర సిద్ధాంతాలను ఎవరైనా, ఎక్కడైనా ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడొచ్చని.. అన్నీ ఇప్పటికిప్పుడు అందుబాటులో ఉన్నయాని.. మరోవైపు సోషల్ మీడియాలో యూట్యూబ్స్ వరకు సమాజంలో ప్రతి ఒక్కరూ అససభ్యకమైన పదాలను మాట్లాడుతున్నారని అన్నారు. ఈ మేరకు సుధీర్ఘ ట్వీట్ చేశారు వర్మ.

ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..

సినిమా శక్తివంతమైన మాధ్యమం అని.. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అంతకంటే ఎక్కువ విస్తృతి ఉందని అన్నారు. ఇలాంటి పరిస్థితులలో సినిమాలోని పదాన్ని కట్ చేయడం… షాట్ ట్రిమ్ చేయడం.. సిగరెట్లను బ్లర్ చేయడం ద్వారా సమాజాన్ని రక్షిస్తున్నామని సెన్సార్ బోర్డ్ నమ్మడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..

ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..