
సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ చేసే కామెంట్స్ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. దర్శకుడిగా ఒక వెలుగు వెలిగిన ఆర్జీవీ.. ఇప్పుడు అంతగా సక్సెస్ లు అందుకోలేకపోతున్నారు. ఆయన ఏం చేసినా అది ఓ పెద్ద వార్తే అవుతుంది. వివాదం లేకుండా వర్మ ఉండలేరు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలతోనే కాదు తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం అనేది వర్మకే సాధ్యం.. దేనికి భయపడని ఆర్జీవీ.. తన మనసులో మాట కూడా మొఖంమీద చెప్పేస్తారు. ముక్కుసూటిగా మాట్లాడతారు ఆర్జీవీ. సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసే పోస్ట్ లు కూడా కొన్ని వివాదాలకు దారి తీస్తున్నాయి. తాజాగా ఓ స్టార్ హీరో పై షాకింగ్ కామెంట్స్ చేశారు ఆర్జీవీ.
ఇటీవల వరుసగా ఇంటర్వ్యూలో పాల్గొంటున్న ఆర్జీవీ.. మొన్నామధ్య బాలకృష్ణ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన సినిమాలు నేను చూడలేదు అని చెప్పాడు. అలాగే ఐబొమ్మ రవి కేసు పై కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఆర్జీవీ. ఇక ఇప్పుడు ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి చేసిన కామెంట్స్ ఆయన అభిమానులకు కోపం తెప్పిస్తున్నాయి. స్లో మోషన్ లేకపోతే రజనీకాంత్ అసలు స్టార్ హీరో కాదు అంటూ వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలోనూ రజినీకాంత్ పై ఇలాంటి కామెంట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఇక ఇప్పుడు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. స్లో మోషన్ అనేది కనిపెట్టకుండా ఉంటే రజినీకాంత్ అంత సూపర్ స్టార్ అయ్యేవాడు కాదు. ఆయన కంటే ఎవరూ స్లో మోషన్‌ను బాగా వాడుకోలేదు అని చెప్పుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రజినీకాంత్ పై వర్మ ఇలాంటి కామెంట్స్ చేయడం పై అభిమానులు ఫైర్ అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి