Rajamouli & Puneeth: పునీత్ మరణించే వరకు ఆ విషయాలు ఎవరికీ తెలియదు.. రాజమౌళి కామెంట్స్ వైరల్..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. పునీత్ మరణించి

Rajamouli & Puneeth: పునీత్ మరణించే వరకు ఆ విషయాలు ఎవరికీ తెలియదు.. రాజమౌళి కామెంట్స్ వైరల్..
Rajamouli

Updated on: Nov 27, 2021 | 5:35 PM

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. పునీత్ మరణించి నెల రోజులు కావోస్తున్న ఇప్పటికీ అతని జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. ఇక టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు పునీత్ కుటుంబసభ్యులను పరామర్శించి ఆయనకు నివాళులు అర్పించారు. తాజాగా దర్శకుడు రాజమౌళి పునీత్ రాజ్ కుమార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగుళూరులోని పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయన పునీత్ చిత్రపటానికి నివాళులు అర్పించి.. కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం పునీత్ మరణం పై స్పందించారు.

పునీత్ చాలా మంచి వ్యక్తి అని.. తనతో మంచి అనుబంధం ఉందన్నారు రాజమౌళి. నాలుగేళ్ల ముందు బెంగుళూరుకు వచ్చినప్పుడు పునీత్‏ను కలిశానని.. ఎంతో బాగా మాట్లాడుతూ.. రిసీవ్ చేసుకున్నారని తెలిపారు. తనతో మాట్లాడుతుంటే ఓ స్టార్ హీరో మాదిరిగా కాకుండా.. ఓ కుటుంబసభ్యుడితో మాట్లాడినట్టుగా ఫీలయ్యానని తెలిపారు. పునీత్ అకాల మరణం గురించి తెలియగానే షాకయ్యానని.. మన మధ్య ఇక లేరంటే నమ్మలేకపోతున్నానని తెలిపారు. చిన్న సాయం చేస్తే ప్రపంచమంతా తెలియజేయాలనుకుంటాం. కానీ పునీత్ అలా కాకుండా.. ఎంతో మందికి సాయం చేసిన ఎవరికీ చెప్పుకోలేదు. ఆయన మరణం తర్వాతే ఆ విషయాలు అందరికి తెలిసిందన్నారు రాజమౌళి.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రాజమౌళి.. భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Also Read: RRR: ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా కనిపించేది అంతే సమయమా ?.. రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే..

Nayanthara House: అత్యంత ఖరీదైన ప్రదేశంలో ఇల్లు కొనుగోలు చేసిన నయన్‌.. విఘ్నేష్‌ కోసమేనా.?

Trivikram Srinivas: త్రివిక్రమ్‏కు తప్పని సోషల్ మీడియా తిప్పలు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..