SS Rajamouli: మమ్మల్ని గెలిపించడానికి ఆయన తగ్గారు.. చిరంజీవిపై రాజమౌళి ప్రశంసలు..

|

Mar 20, 2022 | 6:49 AM

మెగాస్టార్‌ చిరంజీవిపై (Megastar Chiranjeevi) ప్రశంసలు కురింపించారు దర్శకుడు రాజమౌళి (Rajamouli). చిరంజీవే తెలుగు చిత్రసీమకు

SS Rajamouli: మమ్మల్ని గెలిపించడానికి ఆయన తగ్గారు.. చిరంజీవిపై రాజమౌళి ప్రశంసలు..
Rajamouli
Follow us on

మెగాస్టార్‌ చిరంజీవిపై (Megastar Chiranjeevi) ప్రశంసలు కురింపించారు దర్శకుడు రాజమౌళి (Rajamouli). చిరంజీవే తెలుగు చిత్రసీమకు పెద్ద దిక్కు అని స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు థ్యాంక్స్‌ చెప్పారు జక్కన్న. మోస్ట్ అవైయిటెడ్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. పాన్ ఇండియా మొత్తంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు జక్కన్న అండ్ టీం. ఇక ఆదివారం.. చిక్‏బల్లాపూర్‏లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. రాజమౌళి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవిని ఆకాశానికెత్తేశారు..

రాజమౌళి మాట్లాడుతూ… టికెట్ల ధరల పెంపు కోసం కృషిచేసిన మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక కృజ్ఞతలు. ఏపీ సీఎంతో పలుమార్లు భేటీ అయ్యి, టికెట్ల ధరల పెంపునకు చిరంజీవి ఎంతో కృషి చేశారు, దీనిపై చాలామంది ఆయన్ను విమర్శించారు.. కానీ ఆయన మాత్రం పట్టించుకోకుండా సినిమా కోసం ప్రయత్నించారు. తెలుగు సినీ పరిశ్రమ చిరంజీవికి రుణపడి ఉండాలి. సిని ప్రరిశ్రమ వాళ్లని నెగ్గించడానికి చిరంజీవి తగ్గి, ఎన్నో మాటలు పడ్డారు. సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఉండేందుకు ఆయన ఇష్టపడరని, ఇండస్ట్రీ బిడ్డగా ఉండేందుకే ఇష్టపడతారు. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, చిరంజీవి ట్రూ మెగాస్టార్ అంటూ చెప్పుకొచ్చారు.. టికెట్ల ధరలను పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు జక్కన్న.

Also Read: Puneeth Rajkumar: అందుకే నేను పునీత్‌ చివరి సినిమాకు వెళ్లలేదు.. జేమ్స్‌ చిత్రంపై అప్పు సతీమణి అశ్విని ఎమోషనల్‌..

Bheemla Nayak: భీమ్లా నాయక్‌లో పవన్ వాడిన బైక్‌ను సొంతం చేసుకోవాలా?.. అయితే ఇలా చేయండి

Puneeth Rajkumar: పునీత్ పుట్టిన రోజున నీ స్మృతిలో అంటూ అనాథ వృద్ధులకు అన్నదానం చేసిన హీరో విశాల్.. వీడియో వైరల్

Pushpa 2: పుష్ప సీక్వెల్‌లోనూ ఐటెం సాంగ్‌.. ఈసారి బన్నీతో చిందులేయనుంది ఎవరో తెలుసా.?