Rajamouli: మహేశ్ బాబు 1000 కోట్ల సినిమాకు ఒక్క రూపాయి రెమ్యునరేషన్ తీసుకోని రాజమౌళి.. కారణమిదే

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి సినిమా చేస్తున్నారీ సెన్సేషనల్ డైరెక్టర్. ఇండియానా జోన్స్ తరహాలో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్లను సైతం రంగంలోకి దింపుతున్నారట జక్కన్న. SSMB 29 (వర్కింగ్ టైటిల్‌) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి

Rajamouli: మహేశ్ బాబు 1000 కోట్ల సినిమాకు ఒక్క రూపాయి రెమ్యునరేషన్ తీసుకోని రాజమౌళి.. కారణమిదే
Rajamouli, Mahesh Babu

Edited By:

Updated on: Mar 18, 2024 | 12:43 PM

భారతీయ సినిమా చరిత్రలో అపజయం ఎరుగని డైరెక్టర్ ఎవరంటే.. ఠక్కున గుర్తుకు వచ్చే పేరు దర్శక ధీరుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో జక్కన్న పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఇక ఆర్‌ఆర్‌ఆర్ మూవీతో ఏకంగా గ్లోబల్ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటి రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే నేషనల్ వైడ్ ట్రెండింగ్ గా మారుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి సినిమా చేస్తున్నారీ సెన్సేషనల్ డైరెక్టర్. ఇండియానా జోన్స్ తరహాలో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్లను సైతం రంగంలోకి దింపుతున్నారట జక్కన్న. SSMB 29 (వర్కింగ్ టైటిల్‌) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధికంగా ఏకంగా రూ.1000 కోట్లతో రాజమౌళి- మహేశ్ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అదే సమయంలో నటీనటులు రెమ్యునరేషన్లపై కూడా రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహేశ్ సినిమా కోసం రాజమౌళి తీసుకునే పారితోషకంపై కూడా ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. అదేంటంటే.. 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న SSMB 29 కోసం జక్కన్న ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోట్లేదని సమాచారం. దీనికి బదులుగా ఆయన వేరొక మార్గాన్ని ఎంచుకున్నారట. అదేంటంటే.. ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్‌కి బదులుగా సినిమా లాభాల్లో వాటా తీసుకోనున్నారట ఈ సెన్సేషనల్ డైరెక్టర్ .

సాధారణంగా సినిమాకు థియేటర్, ఓటీటీ, శాటిలైట్స్ రైట్స్ అంటూ కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. ఇక హిట్ టాక్ వస్తే కోట్లు కురుస్తాయి. అందుకే SSMB 29 లో నటించే ప్రధాన నటీనటుల పారితోషికం కంటే ఎక్కువగానే రాబట్టుకునేలా ప్లాన్ చేశారట జక్కన్న. తద్వారా రెమ్యునరేషన్ తో కొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయబోతున్నారట. రాజమౌళితో పాటు మహేశ్ కూడా రెమ్యునరేషన్ కాకుండా సినిమా లాభాల్లో వాటా తీసుకునేందుకు రెడీ అయ్యారట. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ మీడియా సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారింది. SSMB సినిమాలో మహేశ్‌ బాబుకు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ నటించనుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మహేశ్ బాబు స్టైలిష్ లుక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.