Radhe Shyam: ప్రభాస్ కోసం రంగంలోకి జక్కన్న.. రాధేశ్యామ్ సినిమాకు రాజమౌళి అలా..

|

Feb 27, 2022 | 5:37 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన రాధేశ్యామ్ (Radhe Shyam) సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Radhe Shyam: ప్రభాస్ కోసం రంగంలోకి జక్కన్న.. రాధేశ్యామ్ సినిమాకు రాజమౌళి అలా..
Rajamouli
Follow us on

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన రాధేశ్యామ్ (Radhe Shyam) సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వింటెజ్ బ్యాగ్రౌండ్ ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కించారు డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్. ఇందులో ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, సాంగ్స్ సినిమాపై మరింత అంచనాలను పెంచేశాయి. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే కరోనా కేసులు పెరగడంతో ఈ సినిమాను వాయిదా వేశారు మేకర్స్.. అత్యంత భారీ బడ్జెట్‏తో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా వేసవిలో మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్.

ఇప్పటికే డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ వరుసగా ఇంటర్వ్యూస్ ఇస్తుండగా.. మరోవైపు.. ఈ మూవీ నుంచి వరుస సర్‏ప్రైజ్ అప్డేట్స్ రిలీజ్ చేస్తూ.. హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఇటీవల ఈ రాతలే ఫుల్ సాంగ్ విడుదల చేసిన రాధేశ్యామ్ మూవీ టీం.. ఇప్పుడు ప్రభాస్ అభిమానులకు మరో ట్రీట్ ఇచ్చేసింది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా కోసం పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి వాయిస్ అందించనున్నారు. ఈ మూవీకి హిందీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇవ్వగా.. తెలుగులో రాజమౌళి వాయిస్ ఇవ్వనున్నారు. అలాగే కన్నడలో పునీత్ రాజ్ కుమార్ అన్న.. శివ రాజ్ కుమార్.. మలయాళంలో స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. ఈ విషయాలను యూవీ క్రియేషన్స్ ట్వి్ట్టర్ వేదికగా తెలియజేసింది. దీంతో దక్షిణాది చిత్రపరిశ్రమలో రాధేశ్యామ్ సినిమా పై మరింత క్యూరియాసిటీని పెంచేస్తున్నారు మేకర్స్. ఇందులో ప్రభాస్ విక్రమాధిత్య పాత్రలో కనిపించనున్నారు.

Also Read: Prudhvi Raj: భీమ్లా నాయక్ సినిమాపై పృథ్వీ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ విషయంలో బాధగా ఉందంటూ..

Shruti Haasan: కరోనా బారిన పడ్డ హీరోయిన్.. ఆందోళనలో సలార్ చిత్రయూనిట్..

Prakash Raj: చిత్రపరిశ్రమను క్షోభపెడుతూ ప్రోత్సాహిస్తున్నామంటే నమ్మాలా ?.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్..

Chiranjeevi : గ్యాంగ్‌లీడర్‌ మార్క్ మసాలా ఎంటర్‌టైనర్‌‌తో రానున్న మెగాస్టార్..?