RRR Movie: ఇంకా తగ్గని ఆర్ఆర్ఆర్ క్రేజ్.. ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్‏లో..

|

Jan 01, 2023 | 8:30 AM

తాజాగా ఈ మూవీ ప్రపంచంలోని అతిపెద్ద ఐమ్యాక్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నారు. జనవరి9న లాస్ ఏంజెల్స్ లోని టీసీఎల్ చైనీస్ థియేటర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

RRR Movie: ఇంకా తగ్గని ఆర్ఆర్ఆర్ క్రేజ్.. ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్‏లో..
Rrr Movie
Follow us on

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. రూ. 400 కోట్లతో నిర్మించిన ఈ సినిమా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ క్రాస్ చేసింది. కేవలం మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ సత్తా చాటింది. ఈ సినిమాలోని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకు ప్రపంచమే ఫిదా అయ్యింది. జక్కన్న టేకింగ్..క్రియేటివిటి పై హాలీవుడ్ డైరెక్టర్స్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల విడుదలైన జపాన్ లో భారీగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా.. ఎన్నో అవార్డులను అందుకుంది. అలాగే 95వ అకాడమీ అవార్డ్స్ షార్ట్ లిస్ట్ కేటగిరిలో ఈ మూవీలోని నాటు నాటు సాంగ్ ఎంపికైంది. తాజాగా ఈ మూవీ ప్రపంచంలోని అతిపెద్ద ఐమ్యాక్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నారు. జనవరి9న లాస్ ఏంజెల్స్ లోని టీసీఎల్ చైనీస్ థియేటర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

రామ్ చరణ్, ఎన్టీఆర్‏తోపాటు.. డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి జనవరి 9న లాస్ ఏంజెల్స్ లోని టీసీఎల్ చైనీస్ థియేటర్లో జరగబోయే ప్రత్యేక ప్రదర్శనలో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని బియాండ్ ఫెస్ట్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. వేరియెన్స్ ఫిల్మ్స్, అమెరికన్ సినిమాథెక్ భాగస్వామ్యంతో సంయుక్తంగా ఈవెంట్ ను ప్రదర్శిస్తోంది.

ఇవి కూడా చదవండి

ట్రిపుల్ ఆర్ స్క్రినింగ్ తర్వాత చిత్రయూనిట్ ప్రెస్ మీట్ లో పాల్గొననుంది. ఈ ఈవెంట్ కోసం టికెట్స్ జనవరి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభంకానుంది. ఈ ఈవెంట్ టికెట్స్.. అమెరికన్ సినిమాథెక్ అధికారిక టికెటింగ్ సైట్ ద్వారా అందుబాటులో ఉండనున్నాయి. ఈసినిమాలో అజయ్ దేవగన్, శ్రియా, అలియా భట్ కీలకపాత్రలలో నటించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.