AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puri Jagannadh: డబుల్ ఇస్మార్ట్ దెబ్బ.. కాస్ట్లీ ప్రాప‌ర్టీ అమ్మేసిన పూరి జగన్నాథ్.?

విజయ్ దేవరకొండతో లైగర్ అనే సినిమా చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. పూరి ఫ్యాన్స్ ఈ సినిమా దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు కూడా.. సినిమా విడుదలకు ముందు కుమ్మేస్తుంది.. ఆగ్ లాగాదేంగే అన్నారు. తీరా సినిమా బెడిసికొట్టింది. ఆ సినిమా తర్వాత ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Puri Jagannadh: డబుల్ ఇస్మార్ట్ దెబ్బ.. కాస్ట్లీ ప్రాప‌ర్టీ అమ్మేసిన పూరి జగన్నాథ్.?
Puri Jagannadh
Rajeev Rayala
|

Updated on: Aug 27, 2024 | 6:25 PM

Share

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ఇటీవలే వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతర్వాత పూరి హిట్ కొట్టడానికి చాలా కష్టపడుతున్నారు. విజయ్ దేవరకొండతో లైగర్ అనే సినిమా చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. పూరి ఫ్యాన్స్ ఈ సినిమా దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు కూడా.. సినిమా విడుదలకు ముందు కుమ్మేస్తుంది.. ఆగ్ లాగాదేంగే అన్నారు. తీరా సినిమా బెడిసికొట్టింది. ఆ సినిమా తర్వాత ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తీసుకొచ్చారు. రామ్ పోతినేని హీరోగా చేసిన ఈ సినిమా ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటించారు.

ఇది కూడా చదవండి : రవితేజ పక్కన లవర్‌గా, వదిన నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీహిట్ అందుకుంటుందని అంతా అనుకున్నారు కానీ ఇది కూడా బెడిసి కొట్టింది. అయితే ఈ సినిమా కారణంగా ఇప్పుడు పూరిజగన్నాథ్ ఓ ప్రోపర్టీని అమ్ముకున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో డిస్టిబ్యూటర్స్ నష్టాలు వచ్చాయట. దాంతో ఇప్పుడు ఆ నష్టాలను పూడ్చే పనిలో పడ్డారట పూరిజగన్నాథ్.

ఇది కూడా చదవండి : Ram Charan: అమ్మబాబోయ్..! రామ్ చరణ్ సిస్టర్ దుమ్మురేపిందిగా.. ఫోజులు చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే

ఈ సినిమాతో అప్పులు మ‌రింత పెరగడంతో ఇప్పుడు పూరి ఓ ప్రోపర్టీని అమ్మేశారని తెలుస్తోంది. హైదరాబాద్ శంషాబాద్ లోని ఓ విలువైన ప్రాప‌ర్టీని పూరి అమ్మేశాడ‌ని ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. ‘డ‌బుల్ ఇస్మార్ట్’కు ముందు పూరి ఆఫీస్ లో పెద్ద పంచాయితీ జరిగిందట. గతంలో పూరి క్లియర్ చేయాలనీ రచ్చ జరిగిందట. దాంతో శంషాబాద్‌లోని ప్రాప‌ర్టీని అప్ప‌టికప్పుడు రూ.18 కోట్ల‌కు అమ్మేయాల్సివ‌చ్చింద‌ని తెలుస్తోంది. ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా నిరాశపరచడంతో ఇప్పుడు అప్పులు మరింత పెరిగాయని తెలుస్తోంది. డబుల్ ఇస్మార్ట్  నైజాంలో విడుద‌ల చేసిన నిరంజ‌న్ రెడ్డి భారీగా న‌ష్ట‌పోయాడట. దాంతో ఇప్పుడు పూరి ఆ అప్పులను కూడా క్లియర్ చేయాలి. దాంతో ఇప్పుడు పూరిజగన్నాథ్ ఈ అప్పును క్లియర్ చేయడానికి మరో ప్రోపర్టీ తాకట్టుపెట్టడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?