Puri Jagannadh: ఆ పాటను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన పూరి జగన్నాథ్..

|

Jan 16, 2022 | 8:12 AM

మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాద్ ప్రస్తుతం లైగర్ సినిమా షూటింగ్‏లో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీలో

Puri Jagannadh: ఆ పాటను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన పూరి జగన్నాథ్..
Puri Jagannadh
Follow us on

మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాద్ ప్రస్తుతం లైగర్ సినిమా షూటింగ్‏లో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య నటిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచానాలు భారీగానే ఉన్నాయి. ఇటీవల లైగర్ నుంచి విడుదలైన గ్లింప్స్ మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచేశారు మేకర్స్. పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్న ఈ సినిమా నిర్మాణంలోనూ భాగమయ్యారు పూరి. ఇటు సినిమాలు తెరకెక్కిస్తూనే.. మరోవైపు యూట్యూబ్‏లో పూరి మ్యూజింగ్స్ అంటూ తన ఆలోచనలను.. అనుభవాలను షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా పూరి మ్యూజింగ్స్ ద్వారా ఆడవాళ్లు ఎప్పుడూ ఏడవకూడదంటూ చెప్పుకోచ్చారు. ఈ క్రమంలో బాబ్ మార్లే పాడిన పాటకు అసలు అర్థాన్ని వివరించారు.

పటాయ్ బీచ్ ఒడ్డున రెస్టారెంట్ లో కూర్చున్నప్పుడు.. ఒక వ్యక్తి బాబ్ మర్లే పాటలు పాడుతున్నాడు. రెండు పాటల తర్వాత అతను నో విమెన్ నో క్రై అనే సాంగ్ స్టార్ట్ చేశాడు. ఆ పాట వింటూనే అక్కడున్న మగవాళ్లంతా అరుపులు, విజిల్స్ వేయడం ప్రారంభించారు. దీంతో రెస్టారెంట్ లో ఆడవాళ్లు మొహాలు చిన్నబుచ్చుకుని కూర్చున్నారు. సింగర్ నో విమెన్ నో క్రై అన్నప్పుడల్లా.. అక్కడున్న మగవాళ్లు అతనితో గొంతు కలిపి అనడం ప్రారంభించారు. కానీ ఆ పాట అసలు అర్థం నో విమెన్ నో క్రై కాదు.. నో విమెన్ న క్రై. అంటే ఆడవాళ్లు ఏడవద్దు అని. నిజానికి ఈ పాటను రాసింది మార్లే రాశాడు అనుకుంటారు. కానీ రాసింది విన్సెంట్ ఫోర్ట్. అతను ఆ లిరిక్స్ స్పూర్తిగా తీసుకుని బాబ్ మార్లే ఆ పాట పాడాడు.

ట్రెంట్ టౌన్ లో ప్రభుత్వ స్థలంలో కూర్చున్నప్పుడు మంచి వ్యక్తులను, స్నేహితులను కలవడం, రాత్రులు దీపాలు వెలిగించడం.. కార్న్ మీల్ తో పూరిట్జ్ వండుకోవడం నాకు గుర్తుంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వ రాజకీయాల వలన అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కోల్పోతున్నారు. త్వరలో మనకు మంచి రోజులు వస్తాయి అని విన్సెంట్ రాశాడు. దాని స్పూర్తితో బాబ్ మార్లే ఆడవాళ్లు మీరు ఏడవద్దు అంటూ ఆలపించారు. కానీ ఈ పాటను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను కూడా అలాగే అర్థం చేసుకున్నాను. జమైకా మినహా ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఈ పాటను తప్పుగానే అర్థం చేసుకున్నారు. నో విమెన్ నో క్రై అనే పదం మినహా మిగతా లిరిక్స్ ఎవరు పట్టించుకోలేదు.. ఇకపై ఈ పాట వినప్పుడు గోల చేయకండి. ఇది ఆడవాళ్ల కన్నీళ్లు తుడిచే పాటు అంటూ పూరి చెప్పుకోచ్చారు.

Also Read: Naga Chaitanya: ఆ విష‌యంలో నాకు స‌మంతే బెస్ట్‌.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన నాగ‌చైత‌న్య‌..

Sumanth’s Malli Modalaindi: ఓటీటీకే ఓటేసిన అక్కినేని హీరో.. డైరెక్ట్ డిజిటల్ రిలీజ్‌కు రెడీ అయిన ‘మళ్లీ మొదలైంది’.

Pushpa Srivalli Dance: శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి టీమిండియా క్రికెటర్లు.. అదరగొట్టేశారుగా.!

Anasuya Bharadwaj: అనసూయ తమిళ్ మూవీ నయా పోస్టర్ చూశారా.. ఆకట్టుకుంటోన్న అందాల భామ..