
టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాధ్ తన సినిమాల్లోని హీరోల పాత్రలు నిజ జీవితం నుంచి పుట్టుకొచ్చినవి అని తెలిపారు. తన బాల్యం చీకటిమయం కావడంతో ఇలాంటి కథలు రాస్తారని, సమాజం పట్ల ఆగ్రహం, ఫ్రస్ట్రేషన్ ఉంటాయని కొందరు భావిస్తున్నట్టుగా చెప్పిన దర్శకుడు పూరి.. తనకు చీకటి బాల్యం లేదని, తల్లిదండ్రులు తనను చక్కగా పెంచారని స్పష్టం చేశారు.
ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’
తల్లిదండ్రుల సంరక్షణలో హ్యాపీగా పెరిగిన పిల్లల కంటే, ఒక పేరెంట్‌ను కోల్పోయినవారు లేదా అమ్మానాన్న ఇద్దరినీ కోల్పోయినవారు జీవితంలో ఎక్కువ సఫర్ అవుతారని ఆయన పేర్కొన్నారు. అలాంటి పిల్లలు సహజంగానే మరింత బలంగా ఉంటారని, వారిలో స్ట్రెంగ్త్, సర్వైవల్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి పెయిన్ చూసి పెరిగినవారే చాలా స్ట్రాంగర్‌గా ఉంటారని తాను భావిస్తానని పూరీ జగన్నాధ్ వివరించారు. అందుకనే తన కథల్లో హీరోలు అనాథలుగా లేదా బ్రోకెన్ ఫ్యామిలీల నుంచి వచ్చినవారిగా ఉంటారని, వారిని తాను చాలా బలమైన వారిగా ఫీల్ అవుతానని చెప్పారు.
ఇది చదవండి: టైమ్ చూసి చావుదెబ్బ కొట్టారు కదా భయ్యా.! ఇక టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు..
ఒక రైటర్‌గా, తనకు అన్నీ ఉండి పక్కవారికి లేనిది చూసినప్పుడు ఎక్కువ బాధపడతామని, అలాగే అమ్మానాన్నలు లేని అనాథల బాధను మరింతగా అర్థం చేసుకోగలమని ఆయన అన్నారు. అలాంటి అనాథలు మానసికంగా మనకంటే ఎక్కువ బలంగా ఉంటారని ఆయన నమ్మకం. పిల్లలకు వేటాడి పెట్టడమే కానీ, వేటాడటం నేర్పించమని ఆయన ఒక ఉదాహరణగా చెప్పారు. సంపాదిస్తుంటాం, పిల్లలకు ఇస్తాం, వారు తిని పడుకుంటారు. వారికి బయట ఎలా బతకాలో తెలియదు. కానీ, అనాథలకు తెలుసు. అందుకే తన కథల్లోని పాత్రలు తినాలంటే వేటాడగలవని పూరీ జగన్నాధ్ వివరించారు.
ఇది చదవండి: షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏమన్నారంటే.?
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..