యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేతినిండా సినిమాలతో పుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం.. ఇప్పటికే డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ (Radhe Shyam) చిత్రాన్ని పూర్తిచేశాడు ప్రభాస్. అలాగే కేజీఎఫ్ వంటి సంచలనం సృష్టించిన ప్రశాంత్ డైరెక్షన్లో సలార్ మూవీ చేస్తున్నాడు. అలాగే.. స్పిరిట్, ప్రాజెక్ట్ కే చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా.. ఇటీవల ఆదిపురుష్ (Adipurush) చిత్రాన్ని కంప్లీట్ చేశాడు. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో.. మరో స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడని ముందు నుంచి వినిపిస్తున్న టాక్. అయితే తాజాగా ఆదిపురుష్ స్టోరీ అది కాదంటూ షాకింగ్ న్యూస్ చెప్పాడు డైరెక్టర్ ఓంరౌత్. అందరూ అనుకున్నట్టుగా ఈ మూవీ స్టోరీ ఉండదని… ఇందులో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ పోషించే పాత్రలు అవి కాదంటూ కుండబద్దలు కొట్టాడు.
నిజమే.. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ రాముడు కాదట. ఈ విషయాన్ని డైరెక్టర్ ఓం రవుత్ స్వయంగా వెల్లడించారు. ఈ మెగా మైథలాజికల్ వండర్ గురించి రీసెంట్‌గా నేషనల్ మీడియాతో మాట్లాడిన ఓం.. ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. రామాయణగాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పేరు రాముడు కాదని… ఆయన రాఘవ్ అనే పాత్రలో కనిపిస్తారన్నారు.
అంతేకాదు… కృతిసనన్ పాత్ర పేరు కూడా సీత కాదని… జానకీ అని, సైఫ్ అలీఖాన్ పేరు లంకేష్ అని తెలిపారు. ఇలా డివైన్ నేమ్స్‌కు బదులుగా వేరే పేర్లు పిక్ చేయటం వెనుక రీజనెంటో కూడా క్లారిటీ ఇచ్చారు ఓం. ప్రభాస్ క్యారెక్టర్ రాముడు అనగానే ఓ డివైన్ ఫీలింగ్ వచ్చేస్తోంది. ఇక ఆడియన్స్ ఆ పాత్రను దేవుడిగానే చూస్తారు. అలా కాకుండా ఓ గొప్ప పాత్రగా చూడాలనే ఉద్దేశంతోనే రాముడు అన్న పేరుకు బదులు సినిమాలో రాఘవ్ అనే పేరును వాడామని చెప్పారు.
ఇండియన్ స్క్రీన్ మీద రామయాణ గాథ ఇప్పటికే చాలా సార్లు చూపించారు. టెలివిజన్ సిరీస్‌లుగానూ ప్రేక్షకులను అలరించింది రామాయణం. అలాంటి రామాయణాన్ని మళ్లీ సినిమాగా చేయాలన్న ఆలోచన ఓం రవుత్‌కు ఎందుకు వచ్చింది? ఈ విషయాన్ని కూడా రివీల్ చేశారు ఈ బాలీవుడ్ డైరెక్టర్. 2000లో ముంబై ఫిలిం ఫెస్టివల్‌లో చూసిన ఓ యానిమేషన్ సినిమానే రామాయణం తెరకెక్కించాలన్న ఆలోనకు మూలం అన్నారు.
జపనీస్ ఫిలిం మేకర్ యుగో సాకో రూపొందించిన ప్రిన్స్ ఆఫ్ లైట్ మూవీ చూసిన తరువాతే రామాయణ కథను మరోసారి సినిమా చెప్పాలన్న ఆలోచన వచ్చిందన్నారు. ఒక ఫారినర్ రామాయణ కథను అంత గొప్పగా ఈ జనరేషన్‌కు చెపితే మనం ఏం చేస్తున్నా అన్న ఆత్మ విమర్శ నుంచే ఆదిపురుష్ ఆలోచన వచ్చిందన్నారు.
బైలైన్.. Sathish, ETT, TV9
Ghani: మెగా అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. బాబాయ్ సినిమా కోసం గని వెనకడుగు..
Samantha: “ఐ వాన రీ ప్రొడ్యూస్ యూ”.. నెటిజన్ ప్రశ్న.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన సమంత..