Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సినిమాకు సీక్వెల్.. హీరో ఎవరంటే..

అనుమానాస్పద స్థితిలో సుశాంత్ సింగ్ పుత్ ఆత్మహత్య చేసుకొని మరణించాడు. సుశాంత్ మరణం పై ఇప్పటికి అనుమానాలు ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే దిల్ బేచారా సినిమాకు సీక్వెల్ తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. జాన్‌ గ్రీన్‌ రచించిన నవల ‘ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సినిమాకు సీక్వెల్.. హీరో ఎవరంటే..
Sushant Singh Rajput

Updated on: Jan 19, 2024 | 4:50 PM

దివంగత నటుడు బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన లాస్ట్ మూవీ దిల్ బేచారా.. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కానీ ఈ సినిమా విడుదల కాక ముందే సుశాంత్ సింగ్ చనిపోవడం ఆయన అభిమానులను విషాదంలోకి నెట్టేసింది. అనుమానాస్పద స్థితిలో సుశాంత్ సింగ్ పుత్ ఆత్మహత్య చేసుకొని మరణించాడు. సుశాంత్ మరణం పై ఇప్పటికి అనుమానాలు ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే దిల్ బేచారా సినిమాకు సీక్వెల్ తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. జాన్‌ గ్రీన్‌ రచించిన నవల ‘ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను ముఖేష్‌ చబ్రా తెరకెక్కించారు. క్యాన్సర్ లో పోరాడే ఓ అమ్మాయి, అబ్బాయి చివరి దశలో ప్రేమలో పడటం.. ఆతర్వాత వారి జీవితంలో ఏం జరిగిందన్నది ఈ సినిమాలో చూపించారు.

ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. దిల్‌ బేచారా 2 గురించి తాజాగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దిల్ బేచారా 2 సినిమా త్వరలోనే రెడీ కానుందని టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్లేస్ లో ఎవరు నటిస్తారన్నది కూడా హాట్ టాపిక్ మారింది.

తాజాగా దర్శకుడు ముఖేష్‌ సోషల్ మీడియాలో దిల్ బేచారా2 సినిమా గురించి ప్రస్తావించాడు. దాంతో దిల్ బేచారా 2 త్వరలో ఉంటుందని ప్రచారం ఊపందుకుంది. చాలా మంది సుశాంత్ సింగ్ ను ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సుశాంత్ సింగ్ జూన్ 14 2020లో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అతను డ్రగ్స్ కు బానిసై ఆత్మహత్య చేసుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. డిప్రషన్ కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు చెప్పుకొచ్చారు. అంతే కాదు అతడి ప్రేయసి రియా చక్రవర్తి కూడా కారణం అని కూడా ప్రచారం జరిగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి