AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meher Ramesh: డైరెక్టర్ మెహర్ రమేష్‌కు ఇంత పెద్ద కూతురుందా? గ్రాండ్‌గా మోహన ఎంగేజ్మెంట్.. వీడియో

టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన కూతురు మోహన త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. తాజాగా ఆమె నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు.

Meher Ramesh: డైరెక్టర్ మెహర్ రమేష్‌కు ఇంత పెద్ద కూతురుందా? గ్రాండ్‌గా మోహన ఎంగేజ్మెంట్.. వీడియో
Meher Ramesh
Basha Shek
|

Updated on: May 09, 2026 | 3:02 PM

Share

టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట్లో త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఆయన ఒక్కగానొక్క కూతురు మోహన త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. అనిరుధ్ అనే అబ్బాయితో కలిసి కొత్త జీవితం ప్రారంభించనుంది. ఈ నెల 26న వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. అయితే 12 రోజుల తర్వాత ఈ ఎంగేజ్ మెంట్ కి సంబందించిన స్పెషల్ గ్లింప్స్ వీడియోను నెట్టింట్లో పోస్ట్ చేశాడు మెహర్.అలా పోస్ట్ చేశాడో లేదో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. మోహన్ ఎంగేజ్మెంట్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి-సురేఖ, శ్రీకాంత్, సునీల్, నమ్రత-సితార, కేటీఆర్, వెంకటేశ్, వివి వినాయక్ తదితరులు హాజరై కాబోయే వధూవరులని దీవించారు. కాగా ఈ ఏడాది చివరలోనే మోహన-అనిరుధ్ వివాహ బంధం ఘనంగా జరగనుందని తెలుస్తుంది.

మెగాస్టార్ చిరంజీవికి దగ్గర బంధువైన మెహర్ రమేశ్.. పూరీ జగన్నాథ్ దగ్గర మొదట దర్శకత్వ శాఖలో పనిచేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన 2002లో రిలీజైన ‘బాబీ’ సినిమాలో నటించారు కూడా. ఆ తర్వాత ఎన్టీఆర్ ‘ఆంధ్రావాలా’ని కన్నడలో పునీత్ రాజ్‌కుమార్‌తో ‘వీర కన్నడిగ’ అని తీసి దర్శకుడిగా పరిచమయ్యారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే మహేశ్ ‘ఒక్కడు’ని ‘అజయ్’ పేరుతో కన్నడలో రీమేక్ చేసి మరో సూపర్ హిట్ కొట్టారు.

ఇవి కూడా చదవండి

మెహర్ రమేష్ కూతురు ఎంగేజ్మెంట్ వీడియో..

View this post on Instagram

A post shared by Meher Raamesh (@meherramesh)

ఇక ఎన్టీఆర్ ‘కంత్రి’తో తెలుగులోకి మెహర్ రమేశ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా పెద్దగా ఆడనప్పటికీ ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం బాగా నచ్చింది. దీని తర్వాత ప్రభాస్ తో తీసిన బిల్లా మెహర్ కు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత మెహర్ తెరకెక్కించిన ఎన్టీఆర్ శక్తి, వెంకటేష్ షాడో, చిరంజీవి భోళా శంకర్ సినిమాలు ఒకదానికి మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. ముఖ్యంగా చిరంజీవి ఎంతో నమ్మకంతో భోళా శంకర్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు మెహర్ కు. కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.  ఇచ్చిన దీంతో మెహర్ ప్రస్తుతం సినిమాలేవీ చేయడం లేదు.

పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్ లో మెహర్ రమేష్..

View this post on Instagram

A post shared by Meher Raamesh (@meherramesh)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us