Ponniyin Selvan box office collection: పొన్నియిన్ సెల్వన్ హిస్టారికల్ రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే..

|

Oct 26, 2022 | 8:10 AM

బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్, చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల మార్క్ చేరువలో ఉంది.

Ponniyin Selvan box office collection: పొన్నియిన్ సెల్వన్ హిస్టారికల్ రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే..
Ponniyin Selvan
Follow us on

డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన తమిళ్ చారిత్రక ఇతిహాసం పొన్నియిన్ సెల్వన్. భారీ తారాగణంతో పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్, చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష ప్రధాన పాత్రలలో నటించిన పొన్నియిన్ సెల్వన్ దేశవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల మార్క్ చేరువలో ఉంది. ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా రూ. 464.09 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలై మూడు వారాలు కావొస్తున్న థియేటర్లలో సక్సెస్ ఫుల్‏గా దూసుకుపోతుంది. ముఖ్యంగా తమిళనాడులో ఈ సినిమాకు ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తుంది.

ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా చోళ రాజవంశం.. యుద్ద వారసత్వం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు మణిరత్నం. మొత్తం 5 భాగాలుగా ఉన్న ఈ నవలను.. రెండు పార్ట్‏లుగా తీసుకువస్తున్నారు డైరెక్టర్ మణి. ఇప్పటికే విడుదలైన పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా మంచి వసూల్లు రాబడుతుండగా.. తర్వలోనే సెకండ్ పార్ట్ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

ఇవి కూడా చదవండి

ఇక త్వరలోనే ఈ సినిమా రూ. 500 కోట్ల బెంచ్ మార్క్ అందుకోనుందని ట్రేడ్ ఎక్స్ పర్ట్ మనోబాల తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. తొలివారంలో ఈ మూవీ రూ. 309.59 కోట్ల కలెక్షన్స్ రాబట్టిందని.. ఇక రెండో వారంలో రూ. 107.35 కోట్లు.. కాగా మూడో వారం మొదటి రోజు 6.76 కోట్లు కాగా… రెండో రోజు రూ. 12.80 కోట్లకు చేరుకుంది. మొదటి కొద్ది రోజులు వసూళ్లు తగ్గుముఖం పట్టినా… ఇప్పటివరకు గ్లోబల్ కలెక్షన్ రూ. 464.09 కోట్లు రాబట్టింది. కమల్ హాసన్ నటించి విక్రమ్ చిత్రం తర్వాత అత్యథిక వసూళ్లు రాబట్టిన రెండవ తమిళ సినిమగా పొన్నియిన్ సెల్వన్ నిలిచింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.