విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్యా రాయ్, త్రిష ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న లేటేస్ట్ చిత్రం పొన్నియిన్ సెల్వన్ (ponniyin selvan). ఈ సినిమాకు ఏస్ డైరెక్టర్ మణి రత్నం దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ హిస్టారికల్ ఎపిక్ మూవీగా తెరకెక్కుతున్న ‘పొన్నియిన్ సెల్వన్’.. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 30న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. పొన్నియిన్ సెల్వన్ నుంచి క్యారెక్టర్ లుక్స్ విడుదల చేశారు మేకర్స్.
ఇందులో విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్యా రాయ్, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ పతాకాలపై మణిరత్నం, అల్లిరాజా సుభాస్కరన్ నిర్మాతగాలుగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ హిస్టారికల్ ఫిక్షనల్ ఎపిక్ డ్రామా ‘పొన్నియిన్ సెల్వన్’. భారీ నిర్మాణ విలుువలతో, హై టెక్నికల్ వేల్యూస్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతోంది. అందులో మొదటి భాగం ‘పొన్నియిన్ సెల్వన్ 1’ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటనను విడుదల చేశారు. సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఈ సినిమాలో ప్రధాన తారాగణమైన విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్యా రాయ్, త్రిష పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను విడుదల చేశారు. ఒక్కో లుక్ ఒక్కో తరహాలో డిఫరెంట్‌గా ఆకట్టుకుంటోంది. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీత అందిస్తున్న ఈ చిత్రానికి రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎ.శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
Wishing our Producer Allirajah Subaskaran a very happy birthday!
The Golden Era comes to the big screens on Sept 30th! ?#PS1 #PS1FirstLooks @LycaProductions #AishwaryaRaiBachchan pic.twitter.com/Gp0ajFlwvi— Madras Talkies (@MadrasTalkies_) March 2, 2022
Also Read: Samantha: సమంతకు దూకుడెక్కువ.. షాకింగ్ విషయాలను చెప్పిన ట్రైనర్ జునైద్..
Srivalli Song: శ్రీవల్లీ సాంగ్ బెంగాలీ వెర్షన్ విన్నారా ?.. అదిరిపోయిందిగా..
Ajith: వలిమై తర్వాత స్టైల్ మార్చిన అజిత్.. న్యూలుక్ అదుర్స్ అంటోన్న ఫ్యాన్స్..
Bhagya shree : ప్రభాస్ వాటిని బాగా మెయింటేన్ చేస్తాడు.. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన బాలీవుడ్ నటి