AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రహ్మానందం రేటు పెంచడంతో ఆయనను రంగంలోకి దింపారు.. కట్ చేస్తే స్టార్ కామెడియన్ అయ్యాడు

హాస్యబ్రహ్మా, కామెడీ కింగ్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా సినీరంగంలో అనేక హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉండే బ్రహ్మానందం.. ఇప్పుడు సినిమాలు తగ్గించారు. అయితే మీమ్స్ ద్వారా బ్రహ్మానందం పేరు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.

బ్రహ్మానందం రేటు పెంచడంతో ఆయనను రంగంలోకి దింపారు.. కట్ చేస్తే స్టార్ కామెడియన్ అయ్యాడు
Brahmanandam
Rajeev Rayala
|

Updated on: May 13, 2026 | 4:15 PM

Share

తెలుగు సినిమా రంగంలో హాస్యనటుడిగా బ్రహ్మానందం ప్రేక్షకుల మనసులో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు. ఆయన నటనకు నిలువెత్తు రూపం. తాజాగా బ్రహ్మానందం గురించి దర్శకుడు కనగల జయకుమార్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మానందం గారికి దర్శకులను ఆకట్టుకునే శక్తి ఉంది. ఏ స్విచ్ వేస్తే ఏ లైట్ వెలుగుతుందో ఆయనకు తెలుసని తెలిపారు. రాఘవేంద్రరావు, ఈవివి సత్యనారాయణ వంటి ప్రముఖ దర్శకులను ఆయన తన నటనతో ఆకట్టుకున్నారు. సీరియస్ సన్నివేశాలు చేయడం సులువు, కానీ కామెడీ పండించడం, రాయడం చాలా కష్టం. ఆయన ఉన్నత విద్యార్హతలు కలిగినవారు, తెలుగు సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదువుకున్న లెక్చరర్. ఈ జ్ఞానమంతా ఆయన నటనకు బాగా ఉపయోగపడింది.

ఇది కూడా చదవండి : Suman Setty: ఆ హీరో నన్ను పిలిచి సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. అంతకన్నా ఏం కావాలి

ఆయన మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, అద్భుతమైన డ్రాయింగ్ వేయగలరు. పట్టుదలతో పాటు పరిశ్రమ, సమయస్ఫూర్తి ఉంటేనే నిలదొక్కుకోగలరని ఆయన నిరూపించారు. ఒకానొక దశలో బ్రహ్మానందం గారికి డిమాండ్ పెరిగి, గంటకు లక్ష రూపాయలు పారితోషికం తీసుకున్నారని చెబుతారు. అప్పట్లో కొత్త దర్శకులు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా రావడం వల్ల ఆర్టిస్టుల సమయం వృథా అయ్యేది. ఈ వృథాను నివారించడానికి ఆయన తన రేటును పెంచారు. “నా రేటు ఇది, మీరు ఎన్ని గంటలైనా వాడుకోండి” అని చెప్పేవారు. ఇది ఆయన వైభవం. అయితే, బ్రహ్మానందం గారి రెమ్యునరేషన్ పెరగడంతో, ఇండస్ట్రీలో ఇతర కమెడియన్లకు అవసరం ఏర్పడింది. విశ్వనాథ్, బాపు వంటి దర్శకుల చిత్రాలలో బ్రహ్మానందం లేరు. అటువంటి సమయంలో ఈవివి సత్యనారాయణ వంటి దర్శకులు ఎం.ఎస్. నారాయణ వంటి కమెడియన్లను ప్రోత్సహించారు. బ్రహ్మానందంగారి కన్నా తక్కువ పారితోషికం తీసుకుంటారని, ప్రత్యామ్నాయంగా ఎం.ఎస్. నారాయణను అనేక చిత్రాలలో ఉపయోగించుకున్నారని కనగల జయకుమార్ తెలిపారు.

ఇది కూడా చదవండి : సౌందర్య కాదు.. వెంకటేష్‌తో ఆరు సినిమాలు.. అన్నీ సూపర్ హిట్లే.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఎం.ఎస్. నారాయణకు ప్రత్యేకమైన పాత్రలు, పాటలు కూడా సృష్టించి ఆయనను ఉన్నత స్థాయికి చేర్చారు. బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ మధ్య మంచి స్నేహం ఉండేది. ఎం.ఎస్. నారాయణ బ్రహ్మానందంకు జోకులు చెప్పేవారు. జంధ్యాల గారు బ్రహ్మానందంకు గురువు వంటివారు. “అహనా పెళ్ళంట” చిత్రంలో అరగుండు వేషంతో ఆయనకు అద్భుతమైన పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు. ఈ అవకాశం బ్రహ్మానందం కెరీర్‌కు మలుపు. ఆయన చదువు, తెలివితేటలు, సమయస్ఫూర్తి, లౌక్యం ఆయన ఎదుగుదలకు దోహదపడ్డాయి. బ్రహ్మానందం మంచి భక్తుడు, విశ్వాసి. భక్తి, విశ్వాసాలతో పాటు మంచి ఆర్టిస్ట్, మంచి టేస్ట్, చమత్కారి వంటి సుగుణాలు ఉండబట్టే ఆయన ఇంత ఎత్తుకు ఎదిగారు. 1000 సినిమాలలో కమెడియన్‌గా నటించడం గిన్నిస్ వరల్డ్ రికార్డు. ఇది చాలా గొప్ప విషయం అని కనగల జయకుమార్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఆయన ముందు నిలబడాలన్నా చాలా సిగ్గుపడేదాన్ని..

Ms Narayana

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us