AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: కోట్లు సంపాదించి మోసపోయింది.. ఇండస్ట్రీని అల్లాడించింది.. చివరకు ఆసుపత్రి బెడ్ పై అనాథలా..

దక్షిణాది చిత్రసీమలో ఆమె సృష్టించిన క్రేజ్ ఒక ప్రభంజనం. ఒక సాధారణ మేకప్ అసిస్టెంట్ స్థాయి నుంచి సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ తారగా ఆమె ఎదిగిన తీరు అసాధారణం. ఆ రోజుల్లో స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆ హీరోయిన్ లేకపోతే సినిమా అమ్ముడవ్వడం కష్టమని డిస్ట్రిబ్యూటర్లు భావించేవారు.ఆమె కేవలం ఒక డ్యాన్సర్‌గా మాత్రమే కాకుండా, సినిమా విజయానికి ఒక "మినిమమ్ గ్యారెంటీ" ముద్రగా ఉండేవారు.

Tollywood: కోట్లు సంపాదించి మోసపోయింది.. ఇండస్ట్రీని అల్లాడించింది.. చివరకు ఆసుపత్రి బెడ్ పై అనాథలా..
Kanagala Jayakumar
Rajitha Chanti
|

Updated on: Apr 16, 2026 | 6:39 PM

Share

సిల్క్ స్మితా, తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఒక అసాధారణ తార. ఆమె కొద్దికాలమే జీవించినా, చేసిన సినిమాలు తక్కువైనా, ఆమె ప్రభావం మాత్రం విస్తృతమనే చెప్పాలి. ఆమె జీవితం, మరణం చుట్టూ అనేక మిస్టరీలు, ప్రశ్నలు ఉన్నాయి. రైటర్, డైరెక్టర్ కనగాల జయకుమార్ తన ప్రత్యేక ఇంటర్వ్యూలో సిల్క్ స్మితాతో తన అనుబంధాన్ని, ఆమె సినీ ప్రస్థానంలోని కీలక ఘట్టాలను పంచుకున్నారు. జయకుమార్ తన సినీ జీవితంలో “తాళి” సినిమాకు కో-డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు, నటి రాశిని హీరోయిన్‌గా ఎంపిక చేయమని ఈవీవీ సత్యనారాయణ సూచించారని అన్నారు. అయితే, ఆ పాత్రకు రాశి సరిపోదని, పాత్ర డ్రామాను మోయగల పరిణతి ఆమెకు లేదని జయకుమార్ అభిప్రాయపడినట్లు తెలిపారు. దీంతో రాశి ఆ సినిమా అవకాశాన్ని కోల్పోయారు. ఈ సంఘటన రాశి తండ్రికి, రాశికి తెలిసిన తర్వాత వారు జయకుమార్‌ను నిలదీసినప్పటికీ, జయకుమార్ దానిని ఈవీవీ సత్యనారాయణ నిర్ణయంగా వివరించానని అన్నారు.

కొంతకాలం తర్వాత, చిరంజీవి హీరోగా, క్రాంతి కుమార్ దర్శకత్వంలో “అగ్నిగుండం” సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలోని ఒక పాటకు సిల్క్ స్మిత ఎంపికయ్యారు. అప్పటికే ఆమె స్టార్‌గా ఎదిగారు. షూటింగ్‌కు వచ్చిన సిల్క్ స్మిత, కాలు మీద కాలు వేసుకుని కూర్చుని, జయకుమార్‌ను అనేకసార్లు సూటిగా చూశానని అన్నారు. గతంలో తిరస్కరించిన వ్యక్తిని గుర్తుపట్టి, ఆమె జయకుమార్‌ను టీజ్ చేశారు. “మనం ఎక్కడో కలిసినట్టు ఉన్నామే?” అంటూ ఆమె ప్రశ్నించిందని అన్నారు. ఈ సంఘటనను చిరంజీవి , క్రాంతి కుమార్ నవ్వుతూ విన్నారని.. చిరంజీవి జోక్యం చేసుకుని, సిల్క్ స్మితాతో “నేను చూసుకుంటానులే తమ్ముడు” అని జయకుమార్‌కు హామీ ఇచ్చారని అన్నారు.

సిల్క్ స్మితా ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలు ఆమెలో కసిని పెంచి, కష్టపడి పైకి వచ్చేలా చేశాయి. అయితే, ఆమె జీవితంలో అనేక ఇబ్బందులు పడ్డారు. ఆమెను వాంప్ క్యారెక్టర్‌లో చూడటం, పరిశ్రమలో ఆమెకు ఎదురైన కష్టాలు, ఒక డాక్టర్ తో ఆమె సంబంధం ఆమె కెరీర్‌ను ప్రభావితం చేశాయి. డాక్టర్ సలహా మేరకు హీరోయిన్‌గా నటించిన సినిమాలు విజయం సాధించకపోవడం, మరోవైపు స్పెషల్ సాంగ్స్ అవకాశాలు కోల్పోవడం ఆమెకు ఆర్థికంగా, కెరీర్ పరంగా నష్టం కలిగించింది. ఇవన్నీ ఆమె చివరి దశలో తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. ఆఖరికి ఆమె ఆత్మహత్య చేసుకోవడం, సినీ ప్రపంచానికి ఒక విషాదకర ముగింపుగా మిగిలిపోయింది అంటూ గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..

Silk Smitha

Silk Smitha

Kanagala Jayakumar, Silk Smitha

Kanagala Jayakumar, Silk Smitha

ఎక్కువ మంది చదివినవి : Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..

Follow Us