
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో జయంత్ సి పరాన్జీ ఒకరు. ఆయనకు తెలుగులో మంచి క్రేజ్ ఉండడమే కాకుండా.. ఫాలోయింగ్ సైతం ఎక్కువే. విక్టరీ వెంకటేష్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది హిట్ మూవీ ప్రేమించుకుందాం రా సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. 1997లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ కావడమే కాకుండా.. భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో వెంకీ సరసన అంజలా ఝవేరి కథానాయికగా నటించింది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న జయంత్.. ఆ తర్వాత అగ్ర హీరోలతో సూపర్ హిట్ చిత్రాలను చేశారు. ఇక చాలా రోజులుగా జయంత్ మరో సినిమా తెరకెక్కించలేదు. ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా తీన్ మార్. చాలా కాలం మీడియాకు దూరంగా ఉన్న జయంత్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ క్రమంలోనే డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన ఫిదా సినిమా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బయటపెట్టారు. 2017లో రిలీజ్ అయిన ఫిదా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించారు. అయితే ఈ సినిమాలో వరుణ్ తేజ్ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించాల్సి ఉందట… అలాగే సాయి పల్లవి పాత్రలో బాలీవుడ్ బ్యూటీ దీపికా కనిపించాల్సిందని అన్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో టక్కరి దొంగ వంటి కౌబాయ్ మూవీ తీసిన జయంత్.. ఆ తర్వాత ఒకానొక సమయంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన వద్దకు వచ్చి ఫిదా స్టోరీ చెప్పారని అన్నారు. అలాగే ఆ మూవీని ఆయన మహేష్ బాబు కోసం రాసుకున్నారని.. అన్ని కుదిరితే మహేష్ బాబు జోడిగా దీపికా పదుకొణె తీసుకుని..శేఖర్ దర్శకుడిగా.. నేను ఆ సినిమాను నిర్మిద్దాం అనుకున్నాను. మహేష్ కు కథ చెప్పగా.. ఆయన ఎంతో ఇంప్రెస్ అయ్యారని.. కానీ సూపర్ స్టార్ స్టార్డమ్ ఉన్న హీరోల నుంచి ఫ్యాన్స్ ఎలాంటి సినిమాలు ఆశిస్తారని ఆలోచించి.. ఆ ప్రాజెక్ట్ మహేష్ కు సరిపోదని భావించినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.