
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తుంటారో తెలిసిందే. ఇక ఆయన సినిమాలు రిలీజ్ అయితే థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ చేసే హడావిడి గురించి తెలిసిందే. వకీల్ సాబ్ సినిమా అనంతరం పవన్ నుంచి మరో మూవీ రాలేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉన్నప్పటికీ.. అటు రాజకీయాలు.. ఇటు షూటింగ్స్ కారణంగా మూవీస్ ఆలస్యం అవుతున్నాయి. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు పవన్. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. షూటింగ్ చివరిదశలో ఉంది. ఇటీవలే డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కిస్తోన్న వినోదయ సిత్తం చిత్రీకరణ కంప్లీట్ చేశారు పవన్. ఇక ఇప్పుడు తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేందుకు స్పీడ్ పెంచారు. బుధవారం డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ప్రారంభమైంది.
పవన్ తో సినిమా చేసేందుకు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు హరీష్ శంకర్. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్ వేదికగా ఈ సినిమా గురించి అప్డేట్ ఇస్తూ.. ఫన్నీ వీడియోను షేర్ చేశారు డైరెక్టర్. ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసిందని పేర్కొంటూ.. మంచి మిత్రులు సినిమా నుంచి ఎన్నాళ్లో వేచిన ఉదయం పాటను ట్విట్టర్ వేదికగా షేర్ చేసి తన ఆనందాన్ని బయటపెట్టారు. ఇది చూసిన నెటిజన్స్ హరీష్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
గతంలో పవన్.. హరీష్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరోసారి వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో తొలి రోజు షూట్ జరగనున్నట్లు సమాచారం.
And the Day has arrived !!!!!! #UstaadBhagathSingh pic.twitter.com/bkXFUjyM2r
— Harish Shankar .S (@harish2you) April 5, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.