
ధమాకా సినిమాతో ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మాస్ మాహారాజా రవితేజ. ఇక ఇప్పుడు రావణాసుర సినిమాతో హీరోగా విలనిజం చూపించేందుకు వస్తున్నారు. డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇందులో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజితా పొన్నాడ, దక్ష నగార్కర్ కథానాయికలుగా నటిస్తుండగా.. సుశాంత్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఎక్కువగానే అంచనాలను పెంచేశాయి.
ఏప్రిల్ 7న ఈ సినిమా రిలీజ్ కాబోతుండడంతో ప్రస్తుతం చిత్రయూనిట్ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ సినిమా చేయాలని ఓ నెటిజన్ కోరగా.. రవితేజ.. డైరెక్టర్ హరీష్ శంకర్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.
రావణాసుర సినిమా ప్రచారంలో భాగంగా మంగళవారం ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు రవితేజ. ఈ సందర్భంగా.. “అన్నయ్య హరీష్ అన్నతో ఒక మూవీ సెట్ చేయ్ అన్నయ్య ” అంటూ ఓ నెటిజన్ కోరగా.. ఎమ్మా.. హరీష్ ఏదో అడుగుతున్నారు నిన్నే. అంటూ హరీష్ శంకర్ ను ట్యాగ్ చేశారు మాస్ మాహారాజా. ఇక రవితేజ ట్వీట్ కు హరీష్ స్పందిస్తూ.. అన్నయ్యతో సినిమా కోసం ఒక పీరియాడిక్ డ్రామా కథపై కసరత్తులు జరుగుతున్నాయని.. చరిత్రను పునరావృతం చేస్తున్నామని బదులిచ్చారు. దీంతో మరోసారి మిరపకాయ్ వంటి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ రాబోతుందంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Ha ha ha ha ha
Annaya tho always ready in fact working on a period drama …. Very Soon We r going to repeat history … thank you annayya @RaviTeja_offl ???? https://t.co/5pppddUzJP— Harish Shankar .S (@harish2you) April 4, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.