Harish Shankar: పిల్లలే వద్దనుకుంటోన్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. కారణమేంటో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా తీశాడు హరీశ్ శంకర్. మాస్ ఆడియెన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఆయన ఇప్పుడు మరోసారి పవన్ కల్యాణ్ తో నే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు.

Harish Shankar: పిల్లలే వద్దనుకుంటోన్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. కారణమేంటో తెలుసా?
Harish Shankar

Updated on: Apr 01, 2025 | 10:16 AM

ప్రస్తుతం మాస్ ఆడియెన్స్ ను మెప్పిస్తోన్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో హరీశ్ శంకర్ ఒకడు. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఆయన ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో మరో సినిమా చేస్తున్నాడు. సినిమాలు తప్పితే ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పిన హరీశ్ శంకర్ తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా తన భార్య, పిల్లల విషయంలో ఆయన తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అందులో పెద్ద కొడుకైన నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. చెల్లికి పెళ్లి చేయడం, తమ్ముడిని సెటిల్ చేయడం, అమ్మానాన్నలకు మంచి జీవనశైలి కల్పించడం – ఇవన్నీ నా బాధ్యతలుగా భావించాను. ఈ విషయాల్లో నా భార్య స్నిగ్ధ నాకు అన్ని విధాలా అండగా నిలిచింది. కానీ ఈ బాధ్యలతోనే నేను అలసిపోయా. మళ్లీ నాకు ఇలాంటి బాధ్యతలు వద్దు అనిపించింది. పిల్లలు ఉంటే పూర్తిగా స్వార్థంగా తయారవుతాం అనేది నా ఆలోచన. ఒక్కసారి పిల్లలు పుట్టాక, వారి గురించి మాత్రమే ఆలోచిస్తాం. మన ప్రపంచాన్ని కుదించుకోవటం మొదలవుతుంది. నేను, నా భార్య జీవితాన్ని ఆ బంధనాల్లో పెడదామనుకోలేదు. అందుకే పిల్లల్ని వద్దని అనుకున్నాం. నేను నా భార్య కూర్చుని ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ అభిమానులు, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ పేరును ప్రస్తావిస్తూ..

కాగా హరీష్ శంకర్ ఇదే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ప్రస్తావించారు. ‘ నరేంద్ర మోడీ గారు మూడుసార్లు విజయం సాధించడానికి ఆయనకు పిల్లలు లేకపోవడం కూడా ఒక కారణమని నేను భావిస్తాను. ప్రజలు నమ్మిన విశ్వాసం – ఒక వ్యక్తి పిల్లలు లేకుంటే నిస్వార్థంగా, బాదరబందీలకు లోనికాకుండా పనిచేయగలడు అనే భావన ప్రజల్లో ఉంది. నరేంద్ర మోడీ కూడా అందుకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ’ అన్నారు హరీశ్ శంకర్.

ఇవి కూడా చదవండి

హరీశ్  శంకర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.