Hanu Raghavapudi: నెక్స్ట్ సినిమా ఆ హీరోతోనే.. క్లారిటీ ఇచ్చిన సీతారామం డైరెక్టర్

|

Sep 18, 2022 | 4:32 PM

సీతారామం సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఎలాంటి ఎక్స్పెట్రేషన్స్ లేకుండా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచనలం సృష్టించింది.

Hanu Raghavapudi: నెక్స్ట్ సినిమా ఆ హీరోతోనే.. క్లారిటీ ఇచ్చిన సీతారామం డైరెక్టర్
Hanu Raghavapudi
Follow us on

సీతారామం(Sita Ramam) సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఎలాంటి ఎక్స్పెట్రేషన్స్ లేకుండా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచనలం సృష్టించింది. ఈ సినిమాతో దర్శకుడు హను రాఘవపూడి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యారు. అందాల రక్షాసి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయినా హను. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత లై, పడిపడి లేచే మనసు సినిమాతో ప్రేక్షకుల మనసు దోచేశారు హను రాఘవపూడి. ఇక దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన సీతారామం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో నెక్స్ట్ హను ఎవరితో సినిమా చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది.  అయితే హను మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారని ఈ మధ్య వార్తలు తెగ వినిపిస్తున్నాయి.

నాని శర్వానంద్ తో కలిసి హను సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారని టాక్. తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో హను సినిమా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. హిందూ ముస్లీమ్ జంట ప్రేమకథ నేపథ్యంలోనే సాగుతుందని తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని హను రాఘవపూడి స్వయంగా తెలిపారు. తాజాగా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ.. సెకండ్ వరల్డ్ వార్ పేపథ్యంలో ఈ మూవీ వుంటుందని ఆర్మీ నేపథ్యంలో సాగుతుందని, ఈ మూవీని హీరో నానితో ఖచ్చితంగా చేస్తానని చెప్పుకొచ్చాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో కృష్ణ గాడి వీర ప్రేమ గాద సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నాని దసరా అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి