టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు గుణశేఖర్. ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించిన గుణశేఖర్ ఒక్కడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాలు చేసిన గుణశేకర్ ఇటీవల రుద్రమదేవి సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు శాకుంతలం అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో నటిస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ట్రైలర్ రీసెట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నారు.
గుణశేఖర్ మాట్లాడుతూ.. ‘‘మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారనే దానికి ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఒక్కడు సినిమా ఓ ఎగ్జాంపుల్. అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. శాకుంతలం సినిమాలో ముగ్గురు హీరోలు. కథ ప్రకారం దేవ్ మోహన్ కథానాయకుడు అయితే, సినిమాకు సమంత హీరో. సినిమా వెనుక హీరో దిల్ రాజుగారు. ఈ సినిమా క్రెడిట్ దిల్ రాజుగారికే ఇస్తాను. మనలాంటి దర్శకులు మంచి సినిమాలు తీయాలంటే దిల్‌రాజు వంటి నిర్మాతలు అవసరం. ఆయనలాంటి వాళ్లు ఉంటేనే దర్శకులుగా మేం అనుకున్న సినిమాను తీయగలిగాం అన్నారు. శాకుంతలం సినిమాకు ఏడాది ప్రీ ప్రొడక్షన్ చేశాం.. షూటింగ్ ఆరు నెలలు మాత్రమే చేశాం.. ఏడాదిన్నర పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నాం. ప్రాపర్ సినిమా చేశాం. ప్రేక్షకుల నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయం. చెక్కే దర్శకులను చూశాం. కానీ చెక్కమనే నిర్మాత దిల్‌రాజుగారు.
సమంత గురించి చెప్పాంలంటే.. శకుంతల పాత్రకు ఎందరినో అనుకున్నాం. మా అమ్మాయి నీలిమ యు.కె నుంచి వచ్చి నిర్మాతగా మారుతానని చెప్పి మంచి కథ చెప్పమంది. నేను సోషల్ కథ చెబుతుంటే నేను పాతికేళ్ల ముందు తీసిన రామాయణం తరహా మైథిలాజికల్ కథ చెప్పమంది. అప్పుడు శాకుంతలం సెలక్ట్ చేసుకుంది. ఇప్పటి జనరేషన్స్‌కు మన భారతీయ సంస్కృతి గొప్పతనం చెప్పి తీరాలి నాన్నా అని అంది. తన విజన్‌లో కావ్య నాయకి సమంత. తను మోడ్రన్‌గా ఉంటుంది కదా.. అని అనిపించినా.. కథ చదువుతూ సమంత అయితే ఎలా ఉంటుందని ఆలోచించాను. అప్పుడు తను చేసిన రామలక్ష్మి పాత్ర గుర్తుకు వచ్చింది. అంత మోడ్రన్ అయిన సమంతగారు విలేజ్ అమ్మాయిగా ఎలా మెప్పించారో తెలిసిందే.
సమంతకు కథ చెబుతున్నప్పుడు నాకు శకుంతలగా సమంతనే కనిపించింది. కానీ ఈ కథను సినిమాగా తీయాలంటే ఎన్ని కోట్లు కావాలి. మామూలుగానే పెద్ద సినిమాలను నెత్తిన పెట్టుకుంటాడు. ఇప్పుడు దీన్ని ఎలా తీస్తాడు. ఎన్ని కోట్లు కావాలి. ఆయనే ప్రొడ్యూసర్ .. ఆయనకు మరో మేకర్ ఉంటే అన్‌కాంప్రమైజ్డ్‌గా తీస్తాడు కదా.. అని దిల్ రాజుగారు ఎంటర్ అయ్యారు. స్కై ఈజ్ లిమిట్‌గా సినిమా చేయమన్నారు. సమంత ఇక్కడ సూపర్‌స్టార్. ఆమెకు తగ్గ కథ ఇచ్చారు. కథ పొటెన్షియల్‌కు తగ్గట్లు ఎంత పెట్టాలో అంత ఖర్చు పెట్టండి అని దిల్ రాజుగారు అన్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ ఇండియన్ సినిమాల్లోనే ఇది కాస్ట్ లీ మూవీ. ఒక హీరోయిన్‌ని నమ్మి ఇన్ని కోట్లు దిల్ రాజుగారు ఖర్చు పెట్టటం.. నాపై నమ్మకంతో టీమ్ వర్క్ చేసింది. శాకుంతలం మన సంస్కృతి. పౌరాణిక చిత్రాలు రావటమే అరుదు. అలాంటి సినిమా భవిష్యత్ తరాలకు ప్రామాణికంగా ఉండాలి అన్నట్లుగానే మహా కవి కాళిదాసు.. రాసిన అభిజ్ఞాన శాకుంతలం బేస్ చేసుకుని ఈ సినిమా తీశాను. మనదేశంలో అభిజ్ఞాన శాకుంతలం సినిమాకు ఎంత మంది అభిమానులుంటారో .. విదేశాల్లోనూ అంతే మంది ఉంటారు. ఓ రీసెర్చ్ టీమ్‌ను పెట్టి ప్రాపర్‌గా ఎవరూ ప్రశ్నించకూడదని స్టాండర్డ్స్ మెయిన్ టెయిన్ చేస్తూ సినిమా తీశాం. ఇప్పటి జనరేషన్‌కు కనెక్ట్ అయ్యేలా.. కరెక్ట్ క్లాసికల్ మీటర్ పట్టుకుని మూడేళ్లపాటు కష్టం ఇది. రేపు సినిమా వచ్చిన తర్వాత ఇంత కంటే గొప్ప రెస్పాన్స్ వస్తుంది అనియు అన్నారు గుణశేఖర్.