Devi Prasad: ‘ఆ స్టార్ హీరోయిన్ డిమాండ్స్ తలపొగరుగా అనిపించేవి.. షూటింగ్ మధ్యలో వెళ్లిపోతే..’

దర్శకుడు దేవి ప్రసాద్, నగ్మా ప్రవర్తనపై గత అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆవేశం షూటింగ్ సమయంలో తనకు గౌరవం ఇవ్వలేదని నగ్మా ఆరోపించారు. జూనియర్ సిబ్బందితో భాషా సమస్యలు, ఈగోల వల్ల ఈ వివాదం తలెత్తిందని దేవి ప్రసాద్ వివరించారు. చిరంజీవి, మధుబాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

Devi Prasad: ఆ స్టార్ హీరోయిన్ డిమాండ్స్ తలపొగరుగా అనిపించేవి.. షూటింగ్ మధ్యలో వెళ్లిపోతే..
Devi Prasad

Updated on: Jan 29, 2026 | 1:39 PM

దర్శకుడు దేవి ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి నగ్మా ప్రవర్తన, ఆమెతో జరిగిన వివాదాలపై కీలక విషయాలు పంచుకున్నారు. రిక్షావోడు సినిమా షూటింగ్ సమయంలో నగ్మా సెట్ నుండి వెళ్లిపోతుంటే చిరంజీవి ఆమెతో “నగ్మా నా మాట విని వెళ్ళొద్దు, వెళ్ళొద్దు” అని బతిమిలాడారని విన్నట్టు, అయితే ఆ సంఘటన వెనుక ఉన్న కారణం తనకు స్పష్టంగా తెలియదని దేవి ప్రసాద్ తెలిపారు. అప్పుడు ఏదో చిన్న గొడవ జరిగిందని మాత్రమే తనకు తెలుసని ఆయన పేర్కొన్నారు. అయితే ఆవేశం సినిమా సమయంలో నగ్మాతో తన బృందానికి జరిగిన సంఘటనలను ఆయన వివరంగా చెప్పుకొచ్చారు. నగ్మా తమకు గౌరవం ఇవ్వడం లేదని డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌పై గొడవపడ్డారని దేవి ప్రసాద్ అన్నారు. దీనికి కారణం భాషా సమస్య, కమ్యూనికేషన్ గ్యాప్ అని ఆయన అభిప్రాయపడ్డారు. నగ్మాకు డైలాగులు చెప్పడానికి దాసు అనే సీనియర్ వ్యక్తి ఉండేవారని, ఆయన ద్వారానే నగ్మాకు మాటలు చేరేవని తెలిపారు. దీనివల్ల జూనియర్ సిబ్బందికి ఆమెతో సరిగ్గా కమ్యూనికేషన్ తక్కువగా ఉండేదని పేర్కొన్నారు.

ఇది చదవండి: మటన్ బోటీ ఇలా తింటున్నారా.! అయితే విషంతో సమానం..

మరోవైపు, మధుబాల తమిళం మాట్లాడేవారు కాబట్టి, తమిళం తెలిసిన జూనియర్ సిబ్బంది ఆమెతో సులభంగా మాట్లాడేవారు. సినిమాల గురించి, ఇతర విషయాల గురించి మాట్లాడేవారని, దీనివల్ల మధుబాలతో వారికి మంచి సాన్నిహిత్యం ఉండేదని దేవి ప్రసాద్ వెల్లడించారు. మధుబాలతో బాగుండి తనతో ఎందుకు లేదని నగ్మా భావించి ఉండవచ్చని ఆయన అన్నారు. పరిస్థితి తీవ్రమై, నగ్మా తనను పలకరించకపోతే షూటింగ్‌కు రానని చెప్పినట్లు దేవి ప్రసాద్ తెలిపారు. అప్పటి తమ వయస్సు, అహంభావంతో ఆమె మాటలకు కోప్పడి, తాము కూడా కావాలనే ఆమెను చూసినప్పుడు పలకరించడం మానేశామని, కాళ్లపై కాలు వేసుకొని కూర్చునేవాళ్లమని ఆయన గుర్తు చేసుకున్నారు. చివరి షెడ్యూల్ కోసం నగ్మా క్షమాపణ అడిగితేనే వస్తానని చెప్పడంతో, తమ షెడ్యూల్ దెబ్బతినకుండా ఉండేందుకు డైరెక్షన్ టీమ్ అంతా షూటింగ్ నుండి వైదొలగడానికి సిద్ధపడిందని ఆయన చెప్పారు. అయితే, ఆ తర్వాత ఎవరు ఏం చెప్పారో తెలియదు కానీ, నగ్మానే షూటింగ్‌కు వచ్చారని, చివర్లో అందరితో గుడ్ బై చెప్పి, షేక్‌హ్యాండ్లు ఇచ్చి వెళ్లారని ఆయన వివరించారు. ఈ మొత్తం సంఘటనలు ఆ వయస్సులో ఉండే చిన్నతనం, ఈగోల వల్ల జరిగాయని దేవి ప్రసాద్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: జబర్దస్త్‌లో సుధీర్, హైపర్ ఆది కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నది అతడే..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..