
Chaitanya Rao: “30 వెడ్స్ 21″ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు చైతన్య రావ్ మాధాడి. ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముప్పై ఏళ్ళు వచ్చిన ఓ వ్యక్తి తనకన్నా 9 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈ సిరీస్ లో చూపించారు. ఈ సిరీస్ లో అమాయకుడిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు చైతన్య రావ్. ఇప్పుడు అతడు హీరోగా మారి వెండితెర పై అలరించనున్నాడు. పెళ్లి చూపులు”, “డియర్ కామ్రేడ్”, “దొరసాని”, “ఏబీసీడీ” వంటి పలు సూపర్ హిట్ చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా ఉన్న బిగ్ బెన్ సినిమాస్ ఇప్పుడు కొత్త తరహా చిత్రాలతో, కొత్త దర్శకులకు అవకాశమిస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం శ్రీసింహా కోడూరి హీరోగా “భాగ్ సాలే” అనే చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మిస్తున్న ఈ సంస్థ మరో కొత్త చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.
ఈ మూవీ బిగ్ బెన్ సినిమాస్ సోలో ప్రాజెక్ట్ గా నిర్మితం కానుంది. ఈ చిత్రంలో చైతన్య రావ్ మాధాడి హీరోగా నటిస్తున్నాడు. “ఓ పిట్ట కథ” చిత్ర దర్శకుడు చెందు ముద్దు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ గా ఒక విల్లేజ్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపొందనుంది . త్వరలో ఈ చిత్రాన్ని
లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాలో నటించే నటీనటులు మరియు మిగతా సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తామని నిర్మాత తెలిపారు. మరి ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న చైతన్య రావ్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :