AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi: పెద్ది సినిమాలో ఆ సీనే హైలెట్.. ఆ 40 నిమిషాలు చరణ్ ఇరగదీస్తాడట

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Peddi: పెద్ది సినిమాలో ఆ సీనే హైలెట్.. ఆ 40 నిమిషాలు చరణ్ ఇరగదీస్తాడట
Peddi
Rajeev Rayala
|

Updated on: Jun 03, 2026 | 5:17 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది.. ఈ  సినిమా రిలీజ్ మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అందరూ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఉప్పెన సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు సన డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. తొలి సినిమాతోనే బుచ్చిబాబు సన భారీ విజయన్నీ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ట్ సినిమా తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ , టీజర్స్, సాంగ్స్ , ట్రైలర్ సినిమా పై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ప్రమోషన్స్ లోనూ పెద్ది సినిమా టీమ్ జోరు చూపించింది. పాన్ ఇండియా సినిమా కావడంతో వివిధ ప్రధాన నగరాల్లో ఈ సినిమాను గట్టిగానే ప్రమోట్ చేశారు. ఇటీవలే విజయవాడలోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశం సినిమాకే హైలైట్ గా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలోని 40 నిమిషాల సన్నివేశం ప్రేక్షకులను కట్టిపడేస్తుందట.

ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. చరణ్ నటన ఇరగదీశాడు అని చెప్పారు. అలాగే ఈ సినిమా కథ చాలా బాగుంటుంది. పెద్ది అనే ఆటగాడి కథను మీరు ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్ముతున్నా అన్నారు. అలాగే సినిమాలోని క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని 40 నిమిషాల ఆ సన్నివేశంలో రామ్ చరణ్ నటన అందరిని ఆకట్టుకుంటుందని తెలిపారు. అదేవిధంగా చరణ్ తో పాటు జాన్వికపూర్ కూడా ఆ సన్నివేశంలో తన నటనతో ఆకట్టుకుంటుందని బుచ్చిబాబు తెలిపాడు.. దీని ప్రకారం చూస్తుంటే క్లైమాక్స్ అదిరిపోతుందని, సినిమాకు ఆ సన్నివేశం వన్ ఆఫ్ ది హైలైట్ అవుతుందని అంటున్నారు అభిమానులు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us