ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో అన్ని గుడ్ న్యూస్ లే వినిపిస్తున్నాయి. కొంతమంది పెళ్లిపీటలెక్కుతుంటే మరికొంతమంది తల్లిదండ్రులు అవుతున్నారు. ఇటీవలే స్టార్ హీరోయిన్ హన్సిక పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. అలాగే గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ కూడా పెళ్లిపీటలెక్కారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడని అనౌన్స్ చేసి అభిమానుల్లో ఆనందాన్ని నింపారు చిరంజీవి. పెళ్లైన పదేళ్ల తర్వాత చరణ్ ఉపసన దంపతులు బిడ్డకు జన్మనిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ కూడా తండ్రి కాబోతున్నాడు. ఆ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు తమిళ్ దర్శకుడు అట్లీ కుమార్. అట్లీ అసలు పేరు అరుణ్ కుమార్. అట్లీ టాప్ డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ తర్వాత రాజారాణి సినిమాతో దర్శకుడిగా మారాడు.
అట్లీ నటి కృష్ణ ప్రియను 9 నవంబర్ 2014న వివాహం చేసుకున్నాడు. వీరిది ప్రేమ వివాహం. కృష్ణ ప్రియ పలు సినిమాల్లో హీరోయిన్ సిస్టర్ క్యారెక్టర్స్ చేసింది. తాజాగా ఏ ఇద్దరు తాము తల్లిదండ్రులం కాబోతున్నాం అని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. దాంతో ఈ దంపతులకు సోషల్ మీడియా వేదికగా విషెస్ విల్లువెత్తుతున్నాయి.
తొలి సినిమా రాజారాణి తోనే సూపర్ హిట్ అందుకున్నాడు అట్లీ. ఆ తర్వాత దళపతి విజయ్ తో కలిసి తేరి , మెర్సెల్ , బిగిల్ లాంటి సూపర్ హిట్స్ తెరకెక్కించాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో జవాన్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత దళపతి విజయ్ తో మరో సినిమా చేస్తున్నాడు అట్లీ.
Happy to announce that we are pregnant need all your blessing and love ❤️❤️
Wit love
Atlee & @priyaatleePc by @mommyshotsbyamrita pic.twitter.com/9br2K6ts77
— atlee (@Atlee_dir) December 16, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.