Director Anudeep KV: జాతిరత్నాలు డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్.. దయచేసి అలా ఎవరు నన్ను అడగొద్దంటూ..

|

Oct 23, 2022 | 5:20 PM

తమిళ్ స్టార్ శివకార్తికేయన్.. ఉక్రెయిన్ బ్యూటీ మారియ జంటగా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగుతోపాటు..తమిళ్ రెండు చోట్ల రిలీజ్ అయిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో విలేకరుల సమావేశంలో అనుదీప్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Director Anudeep KV: జాతిరత్నాలు డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్.. దయచేసి అలా ఎవరు నన్ను అడగొద్దంటూ..
Anudeep Kv
Follow us on

డైరెక్టర్ అనుదీప్ కెవి.. హీరో రెంజ్‏లో క్రేజ్ ఉన్న దర్శకుడు. కరోనా తర్వాత ఆయన తెరకెక్కించిన జాతిరత్నాలు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో అనుదీప్ పేరు ఒక్కసారిగా నెట్టింట మారుమోగింది. ఆయన క్రేజీ ఆన్సర్స్, పంచులు.. ప్రాసలతో యాంకర్స్‏కు ఆడుకున్నాడు. దీంతో అనుదీప్ కు ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. జాతిరత్నాలు తర్వాత ఆయన తెరకెక్కించే సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకుల ముందుకు ఇప్పుడు ప్రిన్స్ చిత్రాన్ని తీసుకువచ్చారు. తమిళ్ స్టార్ శివకార్తికేయన్.. ఉక్రెయిన్ బ్యూటీ మారియ జంటగా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగుతోపాటు..తమిళ్ రెండు చోట్ల రిలీజ్ అయిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో విలేకరుల సమావేశంలో అనుదీప్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ప్రిన్స్ సినిమాకు మేము ఊహించని దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ ఎంజాయ్ చేస్తున్నారు. జెస్నికా పాత్ర కోసం మరియా చాలా ఫర్పెక్ట్ గా నటించింది. కానీ కొద్దిగా భాష విషయంలో కొంచెం ఇబ్బంది వుండేది. సీన్ పేపర్ ని రెండు రోజులు ముందుగానే ఇచ్చేవాళ్ళం అని చెప్పుకొచ్చారు అనుదీప్..

అలాగే నటనపై ఆసక్తి ఉందా ? అని విలేకరి అడగ్గా.. లేదని తెలిపారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ అడగడం వలన జాతిరత్నాల్లో కనిపించాను. ఇందులో కూడా చివర్లో కనిపించాల్సి వచ్చింది. ప్రిన్స్ లో కూడా శివకార్తికేయన్ గారు అడగడం వలన తప్పలేదు. ఇకపై సినిమాల్లో కనిపించాలని లేదు. దయచేసి ఎవరూ అడగొద్దు అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.