
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా పెద్ది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా జూన్ 04న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా మే 18న ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే రిలీజైన కొన్ని గంటల్లో పెద్ది ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ముఖ్యంగా యూట్యూబ్ లో ఊహించని స్థాయిలో వ్యూస్, లైక్స్ సాధిస్తూ దూసుకెళ్తోంది. ట్రైలర్ విడుదలైన తొలి 24 గంటల్లోనే 101 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తద్వారా ఈ ఫీట్‌ను అత్యంత వేగంగా అందుకున్న తెలుగు ట్రైలర్‌గా ‘పెద్ది’ ట్రైలర్ కొత్త రికార్డ్ సృష్టించింది. తెలుగులోనే కాదు ప్రస్తుతం పలు భాషల్లో నూ యూట్యూబ్‌లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది పెద్ది ట్రైలర్. మరోవైపు స్టార్ హీరోలు, డైరెక్టర్లు సైతం పెద్ది సినిమా ట్రైలర్ పై స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి పెద్ది ట్రైలర్ పై స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్)లో పెద్ది ట్రైలర్ ను షేర్ చేసిన ఆయన
‘పెద్ది’ ట్రైలర్ పూర్తిగా అద్భుతంగా, మైండ్ బ్లోయింగ్ గా ఉంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ పాత్ర కోసం తన హృదయాన్ని, ప్రాణాన్ని పెట్టేశారు. ఆయన చూపించిన ఇంటెన్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ నిజంగా శ్వాస ఆగిపోయేలా ఉంది. ఈ చిత్రం ద్వారా ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న వెంకట సతీష్ కిలారు గారికి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు, చిత్ర యూనిట్ మొత్తానికి నా బెస్ట్ విషెస్’ అని రాసుకొచ్చారు.
#PeddiTrailer is absolutely phenomenal🔥🔥🔥
Mega Power Star @AlwaysRamCharan Garu has poured his heart and soul into the role, and his intense transformation looks truly breathtaking ❤️🔥
My best wishes to @VenkataSKilaru Garu on his debut production, and all the very best to…
— Anil Ravipudi (@AnilRavipudi) May 20, 2026
అంతకుముందు కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కూడా పెద్ది ట్రైలర్ పై ప్రశంసలు కురిపించాడు.
The #Peddi trailer looks spectacular.https://t.co/s7bGrILKpf
Mega Power Star @AlwaysRamCharan is looking stunning, absolute fire in every frame. The screen presence of @NimmaShivanna anna adds such a magnificent layer to the film, while #JanhviKapoor adds a beautiful, vibrant… pic.twitter.com/0XlnokyAbg
— Rishab Shetty (@shetty_rishab) May 19, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.