Dimple Hayathi: డింపుల్ హయాతికి గుడి కడతానన్న అభిమాని.. హీరోయిన్ షాకింగ్ రియాక్షన్..

|

May 03, 2023 | 9:04 AM

ఇక ఇటీవల ఏపీలోని బాపట్లలో ఓ అభిమాని తన ఫేవరేట్ హీరోయిన్ సమంత గుడి కట్టించి.. అందులో ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇక ఇప్పుడు మరో కథానాయిక కోసం గుడి కడతా అన్నాడు హీరో ఓ అభిమాని. అందుకు ఆ ముద్దుగుమ్మ ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

Dimple Hayathi: డింపుల్ హయాతికి గుడి కడతానన్న అభిమాని.. హీరోయిన్ షాకింగ్ రియాక్షన్..
Dimple Hayathi
Follow us on

సినీతారలను అభిమానించేవారి గురించి చెప్పక్కర్లేదు. తమకు ఇష్టమైన హీరోహీరోయిన్స్ గురించి ఏమైనా చేయడానికి సిద్ధపడిపోతుంటారు. వారి పేర్లను టాటూగా వేయించుకోవడం..లేదంటే తమ ఫేవరేట్ సెలబ్రెటీస్ పుట్టిన రోజు సందర్భంగా అన్నదానం నిర్వహించడం చూస్తుంటాము. అయితే అభిమానం శ్రుతిమించితే వారు చేసే పనులు సైతం అర్థం కావు. వందల కిలోమీటర్లు తమ హీరోలను కలిసేందుకు కాలినడకన యాత్ర చేపడతారు.. లేదంటే లక్షలు ఖర్చు పెట్టి ఆలయాలు కట్టిస్తారు. అప్పట్లో హీరోయిన్ ఖుష్బూ అందానికి.. నటనకు ఫిదా అయిన అభిమానులు తమిళనాడులో ఆమెకు గుడి కట్టించిన సంగతి తెలిసిందే. ఆతర్వాత నిధి అగర్వాల్, నమిత వంటి తారలకు గుడి కట్టించగా.. కరోనా సమయంలో పేదలకు అండగా నిలిచిన సోనూ సూద్ కు గుడి కట్టించి ఆరాధించారు. ఇక ఇటీవల ఏపీలోని బాపట్లలో ఓ అభిమాని తన ఫేవరేట్ హీరోయిన్ సమంత గుడి కట్టించి.. అందులో ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇక ఇప్పుడు మరో కథానాయిక కోసం గుడి కడతా అన్నాడు హీరో ఓ అభిమాని. అందుకు ఆ ముద్దుగుమ్మ ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

మ్యాచో స్టార్ హీరో గోపిచంద్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం రామబాణం. డైరెక్టర్ శ్రీవాస్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో డింపుల్ హయాతి కథానాయికగా నటించింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా చిత్రయూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో ఓ అభిమాని.. డింపుల్ హయాతి కోసం గుడి కట్టించాలనుకుంటున్నానని.. అది పాలరాతితోనా.. లేదా ఇటుకతో కట్టించన అని అడిగాడు. వెంటనే డింపుల్ స్పందిస్తూ.. రెండూ కాదు.. బంగారంతో కట్టించినప్పుడు చెప్పు అంటూ కౌంటరిచ్చింది. దీంతో అక్కడున్న వారంతా నవ్వేసారు.

ఇవి కూడా చదవండి

అలాగే మీపై వచ్చే ట్రోల్స్ ఎలా తీసుకుంటారని అడగ్గా.. మొదట్లో తనకు ట్రోల్స్ ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదని.. కానీ ఇప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదని తెలిపింది. అయితే ఒక పరిది దాటనంత వరకు ట్రోల్స్ ఫన్నీగానే ఉంటాయని.. కానీ హద్దులు దాటితే పరిస్థితి వేరుగా ఉంటుందని.. మేము మనుషులమే కాదా అంటూ కూల్ గా సమాధానం ఇచ్చింది డింపుల్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.