Dimple Hayathi: గ్లామర్ డోస్ పెంచేసిన డింపుల్‌ హయాతి.. ఫోటో షూట్స్‌తో పిచ్చేక్కిస్తోందిగా

గ్లామర్ విషయంలో సూపర్ పాపులర్ అయిన ఈ భామ.. వరుస అవకాశాల విషయంలో మాత్రం వెనకబడిపోతున్నారు. అందుకే... తన టాలెంట్‌ను సోషల్ మీడియా వేదికగా చూపిస్తూ.. మేకర్స్ దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తున్నారు డింపుల్‌.  గద్దలకొండ గణేష్ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌కు ముందు కూడా తెలుగు సినిమాలో నటించారు డింపుల్‌ హయాతి. కానీ హీరోయిన్‌గా చేసినప్పుడు కూడా రాని గుర్తింపు ఈ ఒక్క పాటతో సాధించారు.

Dimple Hayathi: గ్లామర్ డోస్ పెంచేసిన డింపుల్‌ హయాతి.. ఫోటో షూట్స్‌తో పిచ్చేక్కిస్తోందిగా
Dimple Hayathi

Edited By:

Updated on: Jul 29, 2023 | 9:20 AM

ఒక్క పాటతో అందరి దృష్టిని ఆకర్షించి ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు కొట్టేసిన బ్యూటీ డింపుల్ హాయతి. గ్లామర్ విషయంలో సూపర్ పాపులర్ అయిన ఈ భామ.. వరుస అవకాశాల విషయంలో మాత్రం వెనకబడిపోతున్నారు. అందుకే… తన టాలెంట్‌ను సోషల్ మీడియా వేదికగా చూపిస్తూ.. మేకర్స్ దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తున్నారు డింపుల్‌.  గద్దలకొండ గణేష్ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌కు ముందు కూడా తెలుగు సినిమాలో నటించారు డింపుల్‌ హయాతి. కానీ హీరోయిన్‌గా చేసినప్పుడు కూడా రాని గుర్తింపు ఈ ఒక్క పాటతో సాధించారు.

ఆ క్రేజ్‌తోనే ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో లీడ్ హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేశారు. తెలుగు రవితేజకు జోడిగా ఖిలాడీ సినిమాలో నటించారు డింపుల్‌. కానీ సినిమా అనుకున్న రేంజ్‌లో పెర్ఫామ్ చేయకపోవటంతో టాలీవుడ్‌లో అవకాశాలం పెద్దగా రాలేదు. తమిళ్‌లో విశాల్‌కు జోడిగా నటించిన సామాన్యుడు సినిమా కూడా సో సోగానే నడిచింది. ఈ ఎఫెక్ట్ తమిళ అవకాశాల మీద పడింది. రీసెంట్‌గా గోపిచంద్‌కు జోడిగా రామబాణం సినిమాలో నటించినా వర్కవుట్ కాలేదు.

వెండితెర మీద జోష్ తగ్గినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు డింపుల్‌. హాట్ హాట్ ఫోటో షూట్‌లతో నెటిజెన్స్ ఐబాల్స్‌ను ఎట్రాక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ చేసిన ఓ ఫోటో షూట్‌ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారటంతో.. మరోసారి డింపుల్‌ పేరు మారుమోగుతోంది. ప్రజెంట్ డింపుల్‌ చేతిలో ఒకే ఒక్క తెలుగు సినిమా ఉంది. అందుకే గ్లామర్ షోతో కమర్షియల్‌ సినిమాకు తాను పర్ఫెక్ట్ ఛాయిస్ అన్న సిగ్నల్స్ ఇస్తున్నారు ఈ బ్యూటీ.. మరి ఈ ఫోటో షూట్స్‌ చూసైనా.. ఈ భామకు ఛాన్స్‌లిస్తారేమో చూడాలి.