వావ్..పవన్ కోసం స్పెషల్ ప్లయిట్…!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. చాలా కాలం తర్వాత ‘పింక్’ మూవీ కోసం ఇటీవలే మేకప్ వేసుకున్నారు పవన్. ఓ వైపు ఆ మూవీ షూటింగ్‌ను కొనసాగిస్తూనే మరోవైపు వరస ఢిల్లీ పర్యటనలతో రాజకీయాల్లోనూ ప్రకంపనలు రేపుతున్నారు. పవన్ ‘పింక్’ రీమేక్ మూవీ గురించి రోజుకో ఇంట్రస్టింగ్ అబ్డేడ్ ఫిల్మ్ సర్కిర్‌లో సర్కులేట్ అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ […]
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. చాలా కాలం తర్వాత ‘పింక్’ మూవీ కోసం ఇటీవలే మేకప్ వేసుకున్నారు పవన్. ఓ వైపు ఆ మూవీ షూటింగ్‌ను కొనసాగిస్తూనే మరోవైపు వరస ఢిల్లీ పర్యటనలతో రాజకీయాల్లోనూ ప్రకంపనలు రేపుతున్నారు.
పవన్ ‘పింక్’ రీమేక్ మూవీ గురించి రోజుకో ఇంట్రస్టింగ్ అబ్డేడ్ ఫిల్మ్ సర్కిర్‌లో సర్కులేట్ అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ అవుట్ కట్స్‌లో జరుగుతోంది. కాగా సినిమా కోసం పవన్ కేవలం 20 రోజులే కాల్షీట్లు ఇచ్చారని సమాచారం. అయితే హైదరాబాద్ నుంచి కార్లో షూటింగ్ లొకేషన్‌కి వెళ్లాలంటే..ట్రాఫిక్ వల్ల చాలా టైమ్ వేస్ట్ అవుతోందట. ఇందుకోసం చిత్ర నిర్మాత దిల్ రాజు పవర్ స్టార్‌కు స్పెషల్ ప్లయిట్ ఏర్పాటు చేయనున్నారట. అందుకోసం ఇప్పటికే ఓ పెద్ద విమానయాన సంస్థతో సంప్రదింపులు కూడా జరిపారని తెలుస్తోంది. ప్లయిట్ కోసం రూ. కోటి రూపాయలు ఖర్చవ్వనున్నట్టు సమాచారం. వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నివేధా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఫస్ట్ డే షూటింగ్ జరుగుతుండగా కొన్ని ఆన్ లొకేషన్ పిక్స్ లీక్ అయ్యాయి. దీంతో పవన్.. మూవీ యూనిట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.