మరోసారి ‘బాబాయ్’ అవతారమెత్తనున్న బ్రహ్మానందం?
బ్రహ్మి అలియాస్ బ్రహ్మానందం.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన వెండితెరపై కనిపిస్తే చాలు.. కడుపుబ్బా నవ్వాల్సిందే. ఎలాంటి పాత్రలోనైనా.. జీవించి నటించగలరు. ఇప్పటికే ఎన్నో పాత్రల్లో అలరించి నవ్వించారు. విలన్‌గా, కమెడియన్‌గా, హీరోగా ఇలా అన్ని రకాల పాత్రల్లో నటించి మెప్పించారు. బ్రహ్మానందానివి ఎన్ని సినిమాలున్నా.. ‘బాబయ్ హోటల్’ అనే సినిమా మాత్రం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోరు. టైటిల్‌కి తగ్గట్టుగానే.. ఆకలని హోటల్‌కి వచ్చిన వారికి కడుపునిండా పెట్టి పంపించే […]
బ్రహ్మి అలియాస్ బ్రహ్మానందం.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన వెండితెరపై కనిపిస్తే చాలు.. కడుపుబ్బా నవ్వాల్సిందే. ఎలాంటి పాత్రలోనైనా.. జీవించి నటించగలరు. ఇప్పటికే ఎన్నో పాత్రల్లో అలరించి నవ్వించారు. విలన్‌గా, కమెడియన్‌గా, హీరోగా ఇలా అన్ని రకాల పాత్రల్లో నటించి మెప్పించారు. బ్రహ్మానందానివి ఎన్ని సినిమాలున్నా.. ‘బాబయ్ హోటల్’ అనే సినిమా మాత్రం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోరు. టైటిల్‌కి తగ్గట్టుగానే.. ఆకలని హోటల్‌కి వచ్చిన వారికి కడుపునిండా పెట్టి పంపించే పాత్ర అది. ఆయన ఓ హాస్య నటుడైనా.. అంతకుమించిన భావోద్వేగాన్ని ఈ సినిమాలో పండించడమే మెయిన్ రీజన్. మళ్లీ ఇన్నేళ్లకు అదే తరహా పాత్రలో బ్రహ్మీ నటించనున్నారట. ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ తీస్తోన్న ‘రంగమార్తాండ’లో ఇలా కనిపించబోతున్నారనే ప్రచారం టాలీవుడ్‌లో వర్గాల్లో ఊపందుకుంది.
బ్రహ్మానందం.. రంగమార్తాండలో హృదయాన్ని హుత్తకునే పాత్రలో నటిస్తున్నారని.. కృష్ణ వంశీ ఇదివరకే చెప్పారు. అప్పటి నుంచి ఆయన ఎలా కనిపిస్తారా? అని అందరిలోనూ ఆసక్తి మొదలైంది. కాగా.. మరాఠీ చిత్రం ‘నట సామ్రాట్’కు తెలుగు రీమేక్‌గా ‘రంగమార్తాండ’ తెరకెక్కుతోంది. ఇందులో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, శివాత్మిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాకి ఇళయరాజా సంగీతమందిస్తున్నారు.