వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ ఫస్ట్ లుక్ విడుదల.
సాయిధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు విడుదలయింది. ఆ పోస్టర్లో కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ ధరించి ఉన్న వైష్ణవ్ తేజ్ సముద్రం వైపు చేతులు చాపి బిగ్గరగా కేక వేస్తూ కనిపిస్తున్నాడు. తొలి సినిమా కోసమే తన శరీరాకృతిని మార్చుకున్న అతను చాలా చురుగ్గా కనిపిస్తున్నాడు. పోస్టర్లో అతని బాడీ లాంగ్వేజ్ లోని టెంపరమెంట్, సముద్రం.. సినిమా టైటిల్ కు యాప్ట్ అనిపిస్తున్నాయి. వచ్చే వేసవిలో ఏప్రిల్ […]
సాయిధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు విడుదలయింది. ఆ పోస్టర్లో కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ ధరించి ఉన్న వైష్ణవ్ తేజ్ సముద్రం వైపు చేతులు చాపి బిగ్గరగా కేక వేస్తూ కనిపిస్తున్నాడు. తొలి సినిమా కోసమే తన శరీరాకృతిని మార్చుకున్న అతను చాలా చురుగ్గా కనిపిస్తున్నాడు. పోస్టర్లో అతని బాడీ లాంగ్వేజ్ లోని టెంపరమెంట్, సముద్రం.. సినిమా టైటిల్ కు యాప్ట్ అనిపిస్తున్నాయి. వచ్చే వేసవిలో ఏప్రిల్ 2న మూవీని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. లెజెండరీ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసోసియేట్ గా పనిచేసిన బుచ్చిబాబు సాన ‘ఉప్పెన’తో దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాతో కృతి శెట్టి నాయికగా టాలీవుడ్ లో అడుగుపెడుతుండగా, తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఒక ప్రధాన పాత్ర చేస్తున్నారు. ‘రాక్ స్టార్’ దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ‘ఉప్పెన’ను నిర్మిస్తోంది.
#FirstLook… Debut film of #VaisshnavTej – younger brother of #SaiDharamTej – is titled #Uppena… Costars #KrithiShetty and #VijaySethupathi… The #Telugu film – directed by Buchi Babu Sana – will release on 2 April 2020… Mythri Movie Makers & Sukumar Writings are producers. pic.twitter.com/L7FzFsQVNw
— taran adarsh (@taran_adarsh) January 23, 2020