AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aparichitudu: విక్రమ్ ‘అపరిచితుడు’ సినిమాలోని ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా? ఇప్పుడు ఫేమస్ హీరో అయిపోయాడు

2005లో విడుదలైన అపరిచితుడు సినిమా సంచలన విజయం సాధించింది. శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో విక్రమ్ నటనకు అందరూ ముగ్ధులైపోయారు. మరి ఇదే సినిమాలో విక్రమ్ చిన్నప్పటి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్టు గుర్తున్నాడా? ఇప్పుడతను ఫేమస్ హీరో అయిపోయాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

Aparichitudu: విక్రమ్ ‘అపరిచితుడు’ సినిమాలోని ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా? ఇప్పుడు ఫేమస్ హీరో అయిపోయాడు
Aparichitudu Movie
Basha Shek
|

Updated on: Nov 07, 2026 | 9:35 PM

Share

ఇప్పుడంటే శంకర్ సినిమాలు పెద్దగా ఆడట్లేదు కానీ.. ఒకప్పుడు ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్, ఆదరణ వేరు. డైరెక్టర్ శంకర్ నుంచి కొత్త సినిమా వచ్చిందంటే చాలు.. ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీసేవారు. జెంటిల్‌మేన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ, రోబో.. ఇలా శంకర్ ఖాతాలో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అయితే ఈ మధ్యన శంకర్ కు ఏది కలిసి రావడం లేదు. ఆయన దర్శకత్వంలో వచ్చిన స్నేహితుడు, రోబో 2, ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. కాగా శంకర్ డైరెక్షన్ లో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన సినిమా ‘అపరిచితుడు’. 2005లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. విక్రమ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అవినీతి, లంచగొండితనం వంటి అంశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్ మూడు పాత్రల్లో అదరగొట్టారు. రాము, రెమో, అపరిచితుడు.. ఇలా మూడు డిఫరెంట్ రోల్స్‌లో ఒదిగిపోయారు. ఈ సినిమాలో విక్రమ్ సరసన సదా హీరోయిన్ గా నటించింది. అలాగే ప్రకాశ్ రాజ్, వివేక్, నాజర్, కళాభవన్ మణి, మనోబాల తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు.

కాగా ఇదే అపరిచితుడు సినిమాలో విక్రమ్ చిన్నప్పటి పాత్రలో ఒక ఛైల్డ్ ఆర్టిస్ట్ అద్భుతంగా నటించాడు. సినిమాలో అతను కనిపించేది కొద్ది సేపే అయినా తన స్క్రీన్ ప్రజెన్స్ తో ఆడియెన్స్ ను కట్టిపడేశాడు. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు విరాజ్. స్క్రీన్ నేమ్ హరి ప్రశాంత్. ఇతని తండ్రి ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్. అయన తమిళనాడు సీఎం, స్టార్ హీరో విజయ్ దళపతి తల్లికి సోదరుడు అవుతాడు. ఆ లెక్కన విరాజ్ విజయ్ కు బావమరిది వరుస అవుతాడు.

కాగా విరాజ్ ఇప్పుడు హీరోగా, సహాయక నటుడిగా రాణిస్తున్నాడు. 2000 లో బియిలే మిహాలో సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు విరాజ్. ఆ తర్వాత దీటుకుతే, అన్నే శరనాధేన్ వంటి చిత్రాల్లో కూడా బాలనటుడిగా మెప్పించాడు. అలా విక్రమ్ అపరిచితుడులోనూ చైల్డ్ ఆర్టిస్టు పాత్ర అంబిగా ఆకట్టుకున్నాడు. ఇక చెన్నై 600028 చిత్రంతో నటుడిగా కూడా అరంగేట్రం చేశాడు. ఆ మధ్యన అరుణ్ విజయ్ నటించిన మిషన్ చాప్టర్ 1 లోనూ ఓ కీలక పాత్రలో మెరిశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం హీరోగానూ, సహాయక నటుడిగానూ సినిమాలు చేస్తున్నాడు విరాజ్.

ఇవి కూడా చదవండి
Actor Viraj

Actor Viraj

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us